యూబీఐ, బీఓబీ రుణాలపై తగ్గిన వడ్డీ రేటు

ABN , First Publish Date - 2020-03-31T06:44:46+05:30 IST

రెపో ఆధారిత రుణాలపై బ్యాంకుల వడ్డీ రేటు తగ్గింపు కొనసాగుతోంది. తాజాగా యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) వ్యక్తిగత, రిటైల్‌ రుణాలపై వడ్డీ...

యూబీఐ, బీఓబీ రుణాలపై తగ్గిన వడ్డీ రేటు

ముంబై : రెపో ఆధారిత రుణాలపై బ్యాంకుల వడ్డీ రేటు తగ్గింపు కొనసాగుతోంది. తాజాగా యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) వ్యక్తిగత, రిటైల్‌ రుణాలపై వడ్డీ రేటు 0.75 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో ఫ్లోటింగ్‌ వడ్డీ రేటు ఉండే యూబీఐ రుణాలపై వడ్డీ రేటు 7.95 శాతం నుంచి 7.20 శాతానికి తగ్గుతుంది. బీఓబీ రుణాలపైనా వడ్డీ రేటు 8 శాతం నుంచి 7.25 శాతానికి తగ్గింది. 

Updated Date - 2020-03-31T06:44:46+05:30 IST