వాట్సాప్‌తోనూ ఉబర్‌ రైడ్‌

ABN , First Publish Date - 2022-08-20T05:50:15+05:30 IST

వాట్సాప్‌, ఉబర్‌ భాగస్వామ్యం వినియోగదారులకు ప్రయోజనం కలుగుతోంది. ఉబర్‌కు చెందిన అఫీషియల్‌ వాట్సాప్‌ చాట్‌బోట్‌తో

వాట్సాప్‌తోనూ ఉబర్‌ రైడ్‌

వాట్సాప్‌, ఉబర్‌ భాగస్వామ్యం వినియోగదారులకు ప్రయోజనం కలుగుతోంది. ఉబర్‌కు చెందిన అఫీషియల్‌ వాట్సాప్‌ చాట్‌బోట్‌తో ఉబర్‌ రైడ్‌ని బుక్‌ చేసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పద్ధతిలో ఉబర్‌ వెబ్‌సైట్‌తో పని ఉండదు. ఇది ఎలా పొందవచ్చంటే...


  • 7292000002 నంబర్ని కాంటాక్ట్‌ లిస్ట్‌లో సేవ్‌ చేసుకోవాలి.
  • వాట్సా్‌పలో సేవ్‌ చేసిన నంబర్‌కి హాయ్‌ లేదంటే హాయ్‌ ఉబర్‌ అని మెసేజ్‌ పంపాలి.
  • పికప్‌, డ్రాప్‌ ఆఫ్‌ చిరునామాలను పంపాలి. పికప్‌ కరెంట్‌ లొకేషన్‌ను షేర్‌ చేయాలి.
  • ఎంత పే చేయాలన్నది అంచనాగా తెలియజేస్తుంది.
  • ప్రిఫర్డ్‌ రైడ్‌ని కన్‌ఫర్మ్‌ చేయాలి.
  • దగ్గర్లోని డ్రైవర్‌కు చేరగానే మీ అభ్యర్థనను ఆమోదిస్తున్నట్టు వాట్సా్‌పలో నోటిఫికేషన్‌ వస్తుంది. ఇక ఆ చాట్‌లో మొత్తం వ్యవహారాన్ని మానిటర్‌ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి లక్నో, దేశ రాజధాని ఢిల్లీకే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. 

Updated Date - 2022-08-20T05:50:15+05:30 IST