మాస్క్ ధరించమన్నందుకు.. ఉబెర్ డ్రైవర్‌పై ముగ్గురు యువతుల దాడి!

ABN , First Publish Date - 2021-03-10T20:33:25+05:30 IST

అమెరికాకు చెందిన ఓ ఉబెర్ డ్రైవర్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మాస్క్ ధరించమన్నందుకు.. ఉబెర్ డ్రైవర్‌పై ముగ్గురు యువతుల దాడి!

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికాకు చెందిన ఓ ఉబెర్ డ్రైవర్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. క్యాబ్ ఎక్కిన ముగ్గురు యువతుల్లో ఒకరు ముఖానికి మాస్క్ ధరించడకపోవడంతో డ్రైవర్ ఆమెను మాస్క్ వేసుకోవాల్సిందిగా కోరాడు. అంతే.. ఆ యువతితో పాటు మరో ఇద్దరు కూడా ఆ డ్రైవర్‌పై విరుచుకుపడ్డారు. జాత్యహంకార వ్యాఖ్యలు చేయడంతో పాటు అతనిపై దగ్గడం, మొబైట్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించడం, అతను ధరించిన మాస్క్‌ను బలవంతంగా లాగి పడేయం చేశారు. ఈ ఘటన శాన్‌ఫ్రాన్సిస్కోలో ఈ నెల 7న చోటుచేసుకుంది. క్యాబ్ డ్రైవర్ సుభాకర్ ఖడ్కా(నేపాల్‌కు చెందిన) యువతులు తన వాహనంలో చేసిన ఈ నిర్వాకాన్ని తన ఫోన్‌లో వీడియో తీసి ట్విటర్‌లో పెట్టాడు. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. 


మాస్క్ లేనిది క్యాబ్‌లో ప్రయాణించడం కుదరదని చెప్పిన తనపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారని సుభాకర్ వాపోయాడు. మాస్క్ ఉంటేనే తన క్యాబ్‌లో ప్రయాణించాలని, లేనిపక్షంలో దిగిపోవాలని చెప్పడంతో ఆ ముగ్గురు యువతులు రెచ్చిపోయారని చెప్పాడు. మొదట మాస్క్ ధరించని యువతి తనవైపు కావాలని దగ్గడం చేసిందని, ఆ తర్వాత తాను ధరించిన మాస్క్‌ను కూడా బలవంతంగా తొలిగించేసిందని తెలిపాడు. అంతటితో ఆగకుండా తనపై వారు పెప్పర్ స్ప్రే ప్రయోగించేందుకు యత్నించినట్లు సుభాకర్ పేర్కొన్నాడు. వారి నిర్వాకాన్ని తన మొబైల్‌లో చిత్రీకరిస్తుండగా లాక్కునే ప్రయత్నరం చేశారని చెప్పుకొచ్చాడు. ఆ ముగ్గురు యువతుల తతంగమంతా కూడా వీడియోలో రికార్డైంది. సుభాకర్ ఫిర్యాదు మేరకు వీడియోలోని దృశ్యాల ఆధారంగా శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.   



Updated Date - 2021-03-10T20:33:25+05:30 IST