మత్తులో 55ఏళ్ల మహిళ.. 22ఏళ్ల యువకుడిపై!

ABN , First Publish Date - 2021-04-23T19:32:47+05:30 IST

ఉబర్ క్యాబ్ డ్రైవర్‌పై ఓ 55 ఏళ్ల మహిళ అకస్మాత్తుగా దాడి చేసిన ఘటన అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న 55ఏళ్ల మహిళ ఉబర్

మత్తులో 55ఏళ్ల మహిళ.. 22ఏళ్ల యువకుడిపై!

వాషింగ్టన్: ఉబర్ క్యాబ్ డ్రైవర్‌పై ఓ 55 ఏళ్ల మహిళ అకస్మాత్తుగా దాడి చేసిన ఘటన అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న 55ఏళ్ల మహిళ ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంది. ఈ క్రమంలో 22ఏళ్ల వ్యక్తి ఆమెను తన కారులోకి ఎక్కించుకున్నాడు. అనంతరం ఆమె నిద్రలోకి జారుకుంది. అయితే నిద్రలోంచి మేల్కొన్న సదరు నర్సు.. ఆకస్మాత్తుగా క్యాబ్ డ్రైవర్‌పై దాడి చేసింది. ‘మై డాటర్’ అంటూ చేతులతో క్యాబ్ డ్రైవర్‌ను ఉక్కిరిబిక్కిరి చేయడంతోపాటు అతని ఛాతి భాగంలో గాయపరించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. సదరు మహిళ మద్యం లేదా మాదక ద్రవ్యాలను సేవించి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ మత్తులోనే ఆమె దాడి చేసుంటుందని భావిస్తున్నారు. 


Updated Date - 2021-04-23T19:32:47+05:30 IST