వాట్సాప్‌ ద్వారా ఉబెర్‌ క్యాబ్‌ బుకింగ్‌!

ABN , First Publish Date - 2021-12-03T07:46:33+05:30 IST

సామాజిక మాధ్యమ వేదిక వాట్సా్‌పతో అంతర్జాతీయ క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఉబెర్‌ జట్టుకట్టింది. ఈ భాగస్వా మ్యం ద్వారా భారత వాసులకు వాట్సాప్‌ ద్వారా ఉబెర్‌ క్యాబ్‌ ను బుక్‌ చేసుకునేందుకు వీలుకల్పించనున్నాయి.

వాట్సాప్‌ ద్వారా ఉబెర్‌ క్యాబ్‌ బుకింగ్‌!

న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ వేదిక వాట్సా్‌పతో అంతర్జాతీయ క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఉబెర్‌ జట్టుకట్టింది. ఈ భాగస్వా మ్యం ద్వారా భారత వాసులకు వాట్సాప్‌ ద్వారా ఉబెర్‌ క్యాబ్‌ ను బుక్‌ చేసుకునేందుకు వీలుకల్పించనున్నాయి. ఉబెర్‌ ఈ సౌకర్యాన్ని ప్రపంచంలో తొలిసారిగా భారత్‌లోనే అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ప్రయాణికులు ఉబెర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, ఆ యాప్‌ ద్వారానే క్యాబ్‌ బుక్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. యూజర్‌ రిజిస్ట్రేషన్‌ నుంచి మొదలుకొని రైడ్‌ బుకింగ్‌, ట్రిప్‌ రిసీట్‌ వరకు అన్నింటినీ వాట్సాప్‌ చాట్‌ ఇంటర్‌ఫేస్‌ ద్వారానే నిర్వహించవచ్చని గురువారం ఉబెర్‌ పేర్కొంది. పైలట్‌ ప్రాజెక్టుగా తొలుత లఖ్‌నవూలో ఈ సేవలను అమలు చేయనున్నట్లు, త్వరలోనే భారత్‌లోని ఇత ర నగరాలకు విస్తరింపజేయనున్నట్లు స్పష్టం చేసింది. 

Updated Date - 2021-12-03T07:46:33+05:30 IST