UAEలో సంపూర్ణ లాక్‌డౌన్?

ABN , First Publish Date - 2022-01-14T14:16:32+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా ఒమైక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా పెద్ద మొత్తంలో ప్రజలు కొవిడ్ బారినపడుతున్నారు. అగ్రరాజ్యం సహా ప్ర

UAEలో సంపూర్ణ లాక్‌డౌన్?

ఎన్నారై డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా ఒమైక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా పెద్ద మొత్తంలో ప్రజలు కొవిడ్ బారినపడుతున్నారు. అగ్రరాజ్యం సహా ప్రపంచ దేశాలన్నింటిలో ఇదే పరిస్థితి నెలకొంది. యూఏఈలో సైతం కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో గతంలో మాదిరిగా సంపూర్ణ లాక్‌డౌన్ తప్పదనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై యూఏఈ మినిస్టర్ గురువారం క్లారిటీ ఇచ్చారు. 



విదేశీ వాణిజ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ థానీ అల్ జెయోదీ స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సంపూర్ణ లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చారు. ఒమైక్రాన్ విజృంభిస్తున్నప్పటికీ యూఏఈలో లాక్‌డౌన్ ఉండబోదన్నారు. భవిష్యత్తులో కొత్త వేరియంట్లు వ్యాప్తి చెందినప్పటికీ సంపూర్ణ లాక్‌డౌన్ ఉండదని స్పష్టం చేశారు. డెల్టా వేరియంట్ కలవర పెట్టినా లక్‌డౌన్ పెట్టలేదని  గుర్తు చేశారు. ఇదిలా ఉంటే.. కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తొలిరోజుల్లో యూఏఈ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది. ప్రయాణాలపై ఆంక్షలను విధించింది. కానీ ఆ తర్వాత కఠిన ఆంక్షలను అమలు చేస్తూ.. ఇతర దేశాల కంటే ముందే సరిహద్దులను తెరిచింది.




Updated Date - 2022-01-14T14:16:32+05:30 IST