13 దేశాల పౌరులకు కొత్త వీసాల జారీని నిలిపి వేసిన యూఏఈ!

ABN , First Publish Date - 2020-11-29T01:23:48+05:30 IST

కొత్త వీసాల జారీలో యూఏఈ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

13 దేశాల పౌరులకు కొత్త వీసాల జారీని నిలిపి వేసిన యూఏఈ!

అబుధాబి: కొత్త వీసాల జారీలో యూఏఈ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 13 దేశాల పౌరులకు వీసాల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ దేశాల జాబితాలో ముస్లిం దేశాలైన పాకిస్తాన్, ఇరాన్, ఆప్గనిస్తాన్‌తో పాటు ఇతర దేశాలు కూడా ఉన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా యూఏఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. నవంబర్ 18 నుంచి తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ సస్పెన్షన్ అమలులో ఉంటుందని దుబాయ్ ఎయిర్‌పోర్ట్ ఫ్రీ జోన్ ప్రకటించింది. కాగా, సస్పెన్షన్ ప్రధానంగా కొత్త ఎంప్లాయిమెంట్, పర్యాటక వీసాను లక్ష్యంగా చేసుకుని విధించిందిగా సమాచారం. యూఏఈ కొత్త వీసాల జారీని నిలిపి వేసిన 13 దేశాల జాబితా ఇదే...

1. పాకిస్తాన్

2. ఇరాన్

3. ఆఫ్గనిస్తాన్

4. సిరియా

5. సోమాలియా

6. లిబియా

7. యెమెన్

8. అల్జీరియా

9. ఇరాక్

10. టర్కీ

11. లెబనాన్

12. కెన్యా

13. ట్యూనీషియా  

Updated Date - 2020-11-29T01:23:48+05:30 IST