భారత ప్రయాణికులకు యూఏఈ తీపి కబురు!

ABN , First Publish Date - 2021-08-19T07:03:38+05:30 IST

భారతీయుల విషయంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వీసా ఆన్ అరైవల్‌ సదుపాయాన్ని తిరిగి ప్రారంభించినట్టు తెలుస్తోంది. యూఎస్ వీసా/గ్రీన్ కార్డు ఉన్న భారతీయులు లేదా యూకే/ఈయూ

భారత ప్రయాణికులకు యూఏఈ తీపి కబురు!

న్యూఢిల్లీ: భారతీయుల విషయంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వీసా ఆన్ అరైవల్‌ సదుపాయాన్ని తిరిగి ప్రారంభించినట్టు తెలుస్తోంది. యూఎస్ వీసా/గ్రీన్ కార్డు ఉన్న భారతీయులు లేదా యూకే/ఈయూ రెసిడెన్సీ వీసా కలిగిన భారత ప్రయాణికులకు వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని యూఏఈ అందుబాటులోకి తెచ్చినట్టు సమాచారం. ‘యూఎస్ విజిటర్ వీసా/గ్రీన్ కార్డు లేదా యూకే/ఈయూ రెసిడెన్సీ వీసాలు కలిగి ఉండి కనీసం ఆరు నెలల పాస్‌పోర్ట్ వ్యాలిడిటీని కలిగి ఉన్న భారత ప్రయాణికులు అబుధాబి సహా యూఏఈలో వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి అర్హులుగా’ ఇథిహాద్ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. అంతేకాకుండా ఈ సదుపాయాన్ని వినియోంచుకునే ప్రయాణికులు 100 దిర్హమ్‌లను చెల్లిస్తే 14 రోజుల గడువుతో వీసా మంజూరు అవుతుందని పేర్కొంది. వీసా గడువు పొడగించుకోవాలనుకునే వారు.. 250 దిర్హమ్‌లను చెల్లిస్తే మరో 14 రోజుల ఆ వీసా చెల్లబాటవుతుందని వెల్లడించింది. 


Updated Date - 2021-08-19T07:03:38+05:30 IST