Abn logo
Oct 13 2021 @ 10:16AM

UAE నివాసితులకు ఇంటి వద్ద నుంచే 3 నిమిషాల్లో బ్యాంక్ ఖాతా..!

దుబాయ్: యూఏఈ నివాసితులు ఇకపై బ్యాంకుకు వెళ్లకుండానే కేవలం మూడు నిమిషాల్లో ఇంటి నుంచే బ్యాంకు ఖాతా తెరిచే అద్భుతమైన అవకాశాన్ని మష్రెక్ బ్యాంకు తీసుకువస్తోంది. దీనికోసం ఫెషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని వినియోగించనుంది. యూఏఈ నివాసితులకు ఫెషియల్ రికగ్నైజేషన్ వ్యవస్థను అందించిన అంతర్గత మంత్రిత్వ శాఖ సహకారంతో మష్రెక్ బ్యాంక్ ఈ కొత్త సేవ అందించనుంది. ఇక మష్రెక్ బ్యాంకు అనేది పూర్తి డిజిటలైజ్ బ్యాంక్. అందుకే నివాసితుల సౌకర్యార్థం ఫెషియల్ రికగ్నైజేషన్ సాంకేతికతను ఉపయోగించి కేవలం మూడు నిమిషాల్లో ఇంటి వద్ద నుంచి బ్యాంక్ ఖాతా తెరవడానికి వీలు కల్పిస్తుంది.

3 నిమిషాల్లో బ్యాంక్ ఖాతా ఇలా..

మొదట మష్రెక్ బ్యాంకు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఎమిరేట్ ఐడీ స్కాన్ చేసి, వివరాలను నిర్ధారించాలి. అనంతరం సెల్ఫీ తీసి ఫొటో పెడితే సరిపోతుంది. వెంటనే ఖాతా ఓపెన్ అయిపోతుంది. డెబిట్ కార్డు ఇంటి అడ్రస్‌కు వస్తుంది. ఇలా కేవలం మూడు నిమిషాల్లో ఇంటి వద్ద కూర్చొనే బ్యాంకు ఖాతా తెరవొచ్చు. ఇక ఇలా ఓపెన్ చేసిన బ్యాంకు అకౌంట్‌ను కొత్త వినియోగదారులు తమ ఎమిరేట్ ఐడీ స్కానింగ్‌తో పాటు ఫెషియల్ రికగ్నైజేషన్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ ప్రక్రియ ద్వారా బ్యాంకింగ్ సేవలను యాక్సెస్ చేయడం కూడా మరింత సురక్షితమని ఈ సందర్భంగా సంబంధిత అధికారులు పేర్కొన్నారు. 

తాజా వార్తలుమరిన్ని...