మహమ్మారి నుంచి కోలుకుంటున్న యూఏఈ!

ABN , First Publish Date - 2020-08-03T15:24:27+05:30 IST

యూఏఈలో మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గతూ.. కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఆదివారం రో

మహమ్మారి  నుంచి కోలుకుంటున్న యూఏఈ!

అబుధాబి: యూఏఈలో మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గతూ.. కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఆదివారం రోజు యూఏఈలో కొత్తగా 239 కరోనా కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. 360 మంది  కరోనాను జయించి, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లుు అధికారులు తెలిపారు. అంతేకాకుండా కరోనా వల్ల నిన్న ఎవరూ మరణించలేదని అధికారులు స్పష్టం చేశారు. యూఏఈ వ్యాప్తంగా నిన్న ఒక్కటే రోజు 42వేల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. కరోనాను కట్టడి చేయడంలో భాగంగా.. దేశ వ్యాప్తంగా మరింత విస్తృతంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. యూఏఈలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 60వేలు దాటింది. ఇందులో 54వేల మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు. 351 మంది మహమ్మారి కాటుకు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యూఏఈలో 6వేల వరకు యాక్టివ్ కేసులు ఉన్నాయి. 


Updated Date - 2020-08-03T15:24:27+05:30 IST