యూఏఈలో ఆగని కరోనా ఉధృతి!

ABN , First Publish Date - 2020-10-20T13:42:31+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. యూఏఈలో కూడా రోజురోజుకీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. సోమవారం రోజు దేశ వ్యాప్తంగా 77వేల కొవిడ్ టెస్టులను నిర్వహించినట్లు

యూఏఈలో ఆగని కరోనా ఉధృతి!

అబుధాబి: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. యూఏఈలో కూడా రోజురోజుకీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. సోమవారం రోజు దేశ వ్యాప్తంగా 77వేల కొవిడ్ టెస్టులను నిర్వహించినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 915 మంది కరోనా బారినపడ్డట్లు తెలిపింది. ఇదే సమయంలో 1,295 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. 3 ప్రాణాలు కోల్పోయారని వివరించింది. కాగా.. ఇప్పటి వరకు యూఏఈలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య కోటీ 17లక్షలకు చేరిందని అధికారులు పేర్కొన్నారు. కరోనా కట్టడికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. మహమ్మారిని వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. మాస్క్ ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కూడా పాటించాలని సూచించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు యూఏఈలో నమోదైన కేసుల సంఖ్య 1.16లక్షలకు చేరగా 1.08లక్షల మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. 466 మందిని మహమ్మారి పొట్టనపెట్టుకుంది. ప్రస్తుతం యూఏఈలో 7,240 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 


Updated Date - 2020-10-20T13:42:31+05:30 IST