యూఏఈలో కొనసాగుతున్న మహమ్మారి ఉధృతి!

ABN , First Publish Date - 2020-09-19T14:34:09+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా విలయం సృష్టిస్తున్న కరోనా వైరస్.. యూఏఈలోనూ విజృంభిస్తోంది. ప్రతిరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కాగా.. శుక్రవారం రో

యూఏఈలో కొనసాగుతున్న మహమ్మారి ఉధృతి!

అబుధాబి: ప్రపంచ వ్యాప్తంగా విలయం సృష్టిస్తున్న కరోనా వైరస్.. యూఏఈలోనూ విజృంభిస్తోంది. ప్రతిరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కాగా.. శుక్రవారం రోజు యూఏఈ వ్యాప్తంగా 97వేలకుపైగా కొవిడ్-19 టెస్టులు చేయగా 865 కరోనా కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో 673 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. ఒకరు మృత్యువాతపడ్డారని వివరించారు. దీంతో ఇప్పటి వరకు యూఏఈలో నమోదైన కేసుల సంఖ్య 83,433కు చేరింది. ఇందులో 403 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యూఏఈలో 10వేలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.


ఇదిలా ఉంటే..యూఏఈలో ఇప్పటి వరకు 8.4 మిలియన్ కొవిడ్-19 టెస్టులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అంతేకాకుండా విదేశాల నుంచి అబుధాబికి వెళ్లే ప్రయాణికులకు అధికారులు కీలక సూచనలు చేశారు. అబుధాబి ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ప్రయాణికులకు కొవిడ్-19 పీసీఆర్ టెస్ట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రయాణికులు ట్రాకింగ్ రిస్ట్‌బ్యాండ్ ధరించి.. 14 రోజులపాటు హోం క్వారెంటైన్‌లో ఉండాలని తెలిపారు. 


Updated Date - 2020-09-19T14:34:09+05:30 IST