యూఏఈలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు..!

ABN , First Publish Date - 2020-07-06T15:25:40+05:30 IST

కరోనా వైరస్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. యూఏఈలో ఈ కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి.. క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. పూర్తి వివరాల్లోకి

యూఏఈలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు..!

అబుధాబి: కరోనా వైరస్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. యూఏఈలో ఈ కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి.. క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదివారం రోజు యూఏఈలో 683 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ఇదే సమయంలో 440 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు మరణించినట్లు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే యూఏఈ వ్యాప్తంగా 47వేల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు యూఏఈ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3.6 మిలియన్ల కొవిడ్-19 పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు ప్రకటించారు. కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటికొచ్చే సమయంలో ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అధికారులు సూచించారు. అదేవిధంగా భౌతిక దూరాన్ని కూడా పాటించాలని కోరారు. ఇదిలా ఉంటే.. యూఏఈ‌లో ఇప్పటి వరకు 51వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 40వేల మంది కరోనాను జయించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 323 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ప్రస్తుతం యూఏఈలో దాదాపు 11వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. 


Updated Date - 2020-07-06T15:25:40+05:30 IST