యూఏఈలో కొనసాగుతున్న కొవిడ్ విజృంభణ !

ABN , First Publish Date - 2020-09-21T13:46:45+05:30 IST

వరల్డ్‌వైడ్‌గా మహమ్మారి కరోనా వైరస్ స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే.

యూఏఈలో కొనసాగుతున్న కొవిడ్ విజృంభణ !

అబుధాబి: వరల్డ్‌వైడ్‌గా మహమ్మారి కరోనా వైరస్ స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. అటు గల్ఫ్‌లో కూడా కొవిడ్ ఉధృతి కొనసాగుతోంది. ప్రధానంగా యూఏఈలో ఈ వైరస్ విజృంభిస్తోంది. అంతకంతకు కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం దేశవ్యాప్తంగా 92వేల కొవిడ్ టెస్టులు చేయగా... 674 మందికి పాజిటివ్‌గా వచ్చిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే నిన్న 761 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు తెలిపింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కొవిడ్ సోకిన్ వారి సంఖ్య 84,916కు చేరితే... మొత్తం రికవరీలు 74,273 అయ్యాయి. ఇప్పటికే 404 మందిని ఈ మహమ్మారి బలిగొంది. ప్రస్తుతం దేశంలో 10,239 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  


ఇక కరోనా వ్యాప్తి నియంత్రణకు ముమ్మరంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న యూఏఈ ఇప్పటివరకు ఏకంగా 8.7 మిలియన్ల కొవిడ్ టెస్టులు పూర్తి చేసింది. అటు వ్యాక్సిన్ ట్రయల్స్‌లోనూ యూఏఈ దూసుకెళ్తోంది. తమ దేశంలో చైనీస్ ఫార్మా కంపెనీ సినోఫార్మ్ అభివృద్ధి చేస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ సీఎన్‌బీజీ సురక్షితం, సమర్థవంతంగా పని చేస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది. మూడో దశ ట్రయల్స్‌లో ఉన్న ఈ వ్యాక్సిన్‌ను మొదట ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్స్‌కు ఇవ్వనున్నట్లు ఇప్పటికే యూఏఈ సర్కార్ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన రెండు రోజుల తర్వాత తాజాగా ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి అబ్దుల్ రహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ ఓవైస్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు. సుమారు 31వేల మంది వాలంటీర్లు ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొంటున్నారు. కాగా, ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లకు చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతున్న అవి తాము ముందు ఊహించినవే అని పరిశోధకులు పేర్కొన్నారు. వాటి ప్రభావం అంతగా ఉండబోదని వారు తెలిపారు. ఇతర దేశాలలో ట్రయల్స్‌లో ఉన్న వ్యాక్సిన్‌లలోనూ ఈ చిన్నపాటి దుష్ప్రభావాలు సాధారణం అని అన్నారు.       




Updated Date - 2020-09-21T13:46:45+05:30 IST