యూఏఈలో ఆగ‌ని కోవిడ్ విజృంభణ‌..!

ABN , First Publish Date - 2020-06-07T15:15:05+05:30 IST

యూఏఈలో రోజురోజుకు కోవిడ్‌-19 ఉధృతి పెరుగుతోంది.

యూఏఈలో ఆగ‌ని కోవిడ్ విజృంభణ‌..!

యూఏఈ: ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా.. అటు గ‌ల్ఫ్‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఖ‌తార్‌, కువైట్‌, యూఏఈలో ఈ వైర‌స్ విరుచుకుప‌డుతోంది. యూఏఈలో రోజురోజుకు కోవిడ్‌-19 ఉధృతి పెరుగుతోంది. శ‌నివారం కూడా 626 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు యూఏఈలో క‌రోనా సోకిన వారి సంఖ్య 38,268కు చేరింది. అలాగే నిన్న 724 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారు 21,061 మంది అయ్యార‌ని ఆ దేశ ఆరోగ్య‌మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 275 మంది ఈ మ‌హ‌మ్మారికి బ‌ల‌య్యారు. మ‌రో 16, 932 మంది దేశంలోని వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.


మ‌రోపైపు క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు యూఏఈ ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా ముమ్మ‌రంగా కోవిడ్ టెస్టులు నిర్వ‌హిస్తోంది. ఇప్ప‌టికే 2.5 మిలియ‌న్ల ప‌రీక్ష‌లు చేసిన యూఏఈ... తాజాగా దేశ ప్ర‌జ‌లంద‌రికీ క‌రోనా టెస్టులు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. కాగా, సోష‌ల్ మీడియా వేదిక‌గా కోవిడ్ విష‌య‌మై త‌ప్పుడు ప్ర‌చారం జ‌ర‌గ‌డంపై యూఏఈ ఆరోగ్య‌శాఖ ప్ర‌త్యేక ప్ర‌తినిధి ఫ‌రీదా హోసాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిజ‌నిజాలు తెలుసుకోకుండా త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ప్ర‌జ‌లు కూడా త‌ప్పుడు ప్ర‌చారాల‌ను న‌మ్మొద్ద‌ని... ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించే విష‌యాల‌ను మాత్ర‌మే ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని సూచించారు.    

Updated Date - 2020-06-07T15:15:05+05:30 IST