యూఏఈలో 993 రిక‌వ‌రీలు.. 532 కొత్త కేసులు

ABN , First Publish Date - 2020-07-08T14:36:41+05:30 IST

గ‌ల్ఫ్‌లో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ కోర‌లు చాస్తోంది. ప్ర‌ధానంగా యూఏఈ, కువైట్‌, ఖ‌తార్‌, సౌదీ అరేబియాలో కోవిడ్‌-19 విరుచుకుప‌డుతోంది.

యూఏఈలో 993 రిక‌వ‌రీలు.. 532 కొత్త కేసులు

యూఏఈ: గ‌ల్ఫ్‌లో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ కోర‌లు చాస్తోంది. ప్ర‌ధానంగా యూఏఈ, కువైట్‌, ఖ‌తార్‌, సౌదీ అరేబియాలో కోవిడ్‌-19 విరుచుకుప‌డుతోంది. యూఏఈలో మంగ‌ళ‌వారం 532 కొత్త కేసులు న‌మోదైతే... 993 రిక‌వ‌రీలు, ఇద్ద‌రు క‌రోనాతో మ‌ర‌ణించిన‌ట్లు ఆరోగ్య‌మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. దీంతో ఇప్ప‌టివ‌రకు దేశ‌వ్యాప్తంగా ఈ వైర‌స్ సోకిన్ వారి సంఖ్య 52,600కు చేరితే.. మొత్తం కోలుకున్న వారు 41,714 అయ్యారు. అలాగే యూఏఈ వ్యాప్తంగా 326 మందిని ఈ మ‌హ‌మ్మారి క‌బ‌ళించింది. ప్ర‌స్తుతం దేశంలోని వివిధ ఆస్ప‌త్రుల్లో 10,560 మంది క‌రోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక ముమ్మ‌రంగా కోవిడ్ టెస్టులు చేస్తున్న యూఏఈ ఇప్ప‌టికే 3 మిలియ‌న్ల‌కుపైగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. మంగ‌ళ‌వారం కూడా 44వేల క‌రోనా ప‌రీక్ష‌లు చేసిన ఆరోగ్య‌శాఖ‌... వ‌చ్చే 60 రోజుల్లో 2 మిలియ‌న్ల కోవిడ్ టెస్టులు చేయ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-07-08T14:36:41+05:30 IST