యూఏఈలో పెరుగుతున్న రిక‌వ‌రీ రేటు

ABN , First Publish Date - 2020-07-09T15:58:07+05:30 IST

యూఏఈలో రోజురోజుకు రిక‌వ‌రీ రేటు పెరుగుతోంది. గత నెలలో 55 శాతంగా ఉన్న రిక‌వ‌రీ రేటు ఇప్పుడు 79.91 శాతానికి చేరింది.

యూఏఈలో పెరుగుతున్న రిక‌వ‌రీ రేటు

యూఏఈ: యూఏఈలో రోజురోజుకు రిక‌వ‌రీ రేటు పెరుగుతోంది. గత నెలలో 55 శాతంగా ఉన్న రిక‌వ‌రీ రేటు ఇప్పుడు 79.91 శాతానికి చేరింది. క‌రోనా బారిన ప‌డ్డ ప్ర‌పంచ దేశాల రిక‌వ‌రీ రేటు కంటే యూఏఈనే టాప్‌లో ఉంది. వ‌ర‌ల్డ్‌వైడ్ రిక‌వ‌రీ రేటు కేవ‌లం 48 శాతం మాత్ర‌మే. ఇక యూఏఈలో బుధ‌వారం 445 కొత్త కేసులు న‌మోదైతే.. 568 రిక‌వ‌రీలు న‌మోదైన‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు కోవిడ్ సోకిన వారి సంఖ్య 53,045కు చేరితే... 42,282 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అలాగే ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా 327 మందిని ఈ వైర‌స్ పొట్ట‌న‌బెట్టుకుంది. మ‌రో 10,436 మంది దేశంలోని వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆరు మిలియ‌న్ల కోవిడ్ టెస్టులు ల‌క్ష్యంగా పెట్టుకున్న యూఏఈ ఇప్ప‌టికే 3 మిలియ‌న్ల‌కు పైగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. ఆగ‌స్టు నెలాఖ‌రు వ‌ర‌కు 6 మిలియ‌న్ మార్కును అందుకునే దిశ‌గా యూఏఈ చ‌ర్య‌లు చేప‌డుతోంది.    


Updated Date - 2020-07-09T15:58:07+05:30 IST