యూఏఈలో 330 కొత్త కేసులు...

ABN , First Publish Date - 2020-08-15T15:33:31+05:30 IST

మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ నుంచి కోలుకుంటున్న యూఏఈలో శుక్ర‌వారం పాజిటివ్ కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి.

యూఏఈలో 330 కొత్త కేసులు...

యూఏఈ: మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ నుంచి కోలుకుంటున్న యూఏఈలో శుక్ర‌వారం పాజిటివ్ కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి. నిన్న ఒక్క‌రోజే 330 కొత్త కేసులు న‌మోదు కాగా... 101 మంది కోల‌కుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా ఈ వైర‌స్ బారిన ప‌డ్డ వారు 63,819 మంది అయితే... మొత్తం రిక‌వరీలు 57,473 అయ్యాయి. ఇప్ప‌టికే యూఏఈ వ్యాప్తంగా 359 మంది క‌రోనాకు బ‌ల‌య్యారు. ప్ర‌స్తుతం దేశంలో 5,987 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మ‌రోవైపు ఈ వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ‌కు యూఏఈ ముమ్మ‌రంగా కోవిడ్ టెస్టులు నిర్వ‌హిస్తోంది. శుక్ర‌వారం కూడా 82,344 క‌రోనా ప‌రీక్ష‌లు చేసింది. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు ఆరు మిలియ‌న్ల కోవిడ్ టెస్టులు పూర్తి చేయాల‌ని యూఏఈ ఆరోగ్య‌శాఖ భావిస్తుండ‌గా... ఇప్ప‌టికే 5.6 మిలియ‌న్ల క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. విరివిగా కోవిడ్ టెస్టులు చేయ‌డం వ‌ల్లే ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తిని అరిక‌ట్ట‌గ‌లిగామని ఆరోగ్య‌శాఖ అధికారులు వెల్ల‌డించారు.  


Updated Date - 2020-08-15T15:33:31+05:30 IST