యూఏఈలో కొనసాగుతున్న కరోనా ఉధ‌ృతి.. ఒక్కరోజే !

ABN , First Publish Date - 2020-09-25T14:06:43+05:30 IST

యూఏఈలో కరోనా ఉధ‌ృతి కొనసాగుతోంది. గురువారం దేశవ్యాప్తంగా నిర్వహించిన 93,618 కొవిడ్ టెస్టుల్లో 1,002 మందికి పాజిటివ్‌గా వచ్చిందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

యూఏఈలో కొనసాగుతున్న కరోనా ఉధ‌ృతి.. ఒక్కరోజే !

అబుధాబి: యూఏఈలో కరోనా ఉధ‌ృతి కొనసాగుతోంది. గురువారం దేశవ్యాప్తంగా నిర్వహించిన 93,618 కొవిడ్ టెస్టుల్లో 1,002 మందికి పాజిటివ్‌గా వచ్చిందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. బుధవారం కూడా యూఏఈలో ఒక్కరోజే 1,083 మంది కరోనా బారిన పడ్డారు. ఇది దేశంలో అత్యధిక సింగిల్-డే పెరుగుదల అని అధికారులు పేర్కొన్నారు. దీంతో అంతకంతకు కొత్త కేసులు పెరుగుతుండడం అధికారులను కలవరపెడుతోంది. అయితే, యూఏఈలో 90 శాతం రికవరీ రేటుతో పాటు కేవలం 0.5శాతం మరణాల రేటు ఉండడం కాస్తా ఊరటనిచ్చే విషయం. 


ముఖానికి మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతి శుభ్రత వంటి ముందు జాగ్రత్త చర్యలను ప్రజలు బేఖాతరు చేయడం వల్లే కొత్త కేసులు పెరుగుతున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారికి భారీ జరిమానాలు విధిస్తున్న ఎలాంటి మార్పు రావడం లేదని అధికారులు వాపోయారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మహమ్మారి మరింత విరుచుకుపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 88,532 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే... 77,937 మంది కోలుకున్నారు. మరో 407 మంది ఈ వైరస్‌కు బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 10,188 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Updated Date - 2020-09-25T14:06:43+05:30 IST