యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫాకు కొండంత ఆస్తులు.. ఎక్కడున్నాయంటే..

ABN , First Publish Date - 2022-05-15T15:12:17+05:30 IST

యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫాకు కొండంత ఆస్తులు.. ఎక్కడున్నాయంటే..

యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫాకు కొండంత ఆస్తులు.. ఎక్కడున్నాయంటే..

యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ 73వ ఏట కన్నుమూశారు. ఈ వార్తను యూఏఈ వార్తా సంస్థ డబ్ల్యుఏఎం వెల్లడించింది. 2019లో షేక్ నాలుగవసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. షేక్ ఖలీఫా మృతితో యూఏఈలో 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. యూఏఈ రాజ్యాంగం ప్రకారం ఫెడరల్ కౌన్సిల్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేంత వరకు, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్-అల్-మఖ్తూమ్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తారు. షేక్ ఖలీఫా ఈ  దేశాన్ని సంపన్నంగా మార్చడాని ప్రయత్నించారు. 2004లో షేక్ ఖలీఫా తన తండ్రి మృతి అనంతరం యూఏఈ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. యూఏఈ రెండవ అధ్యక్షునిగా వ్యవహరించారు. 


షేక్ ఖలీఫా ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరు. అతని ఆస్తుల నికర విలువ $875 బిలియన్లు దాటి ఉంటుంది.  ప్రపంచమంతటా అతనికి ఆస్తులు ఉన్నాయని సమాచారం. అయితే షేక్ కొన్ని తన ఆస్తులను చూడకపోవడం విశేషం.  షేక్ లండన్‌లోని అత్యంత ధనిక భూస్వాములలో ఒకరు. లండన్‌లో పలు భవనాలు ఇతని పేరుతో ఉన్నాయి. ది గార్డియన్ రిపోర్టు ప్రకారం లండన్‌లో 5.5 బిలియన్ పౌండ్ల రియల్ ఎస్టేట్ ఒప్పందం జరగగా, అందులో షేక్‌ వ్యాపార లావాదేవీల పత్రాల వ్యవహారం బయటపడింది. లండన్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో సూపర్ ప్రైమ్ కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాపర్టీలు అతని పేరుతో ఉన్నాయి.

Updated Date - 2022-05-15T15:12:17+05:30 IST