యూఏఈ కీలక ప్రకటన.. సిల్వర్ రెసిడెన్సీ పర్మిట్ ఉంటే..!

ABN , First Publish Date - 2021-06-17T06:16:03+05:30 IST

యూఏఈ కీలక ప్రటకన చేసింది. గల్ఫ్ దేశానికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్న వారికి తీపి కబురు చెప్పింది. కరోనా నిబంధనల నేపథ్యంలో ఇప్పటి వరకు యూఏఈ గోల్డెన్ వీసా ఉన్న వారిని మాత్రమే తమ దేశంలోకి అను

యూఏఈ కీలక ప్రకటన.. సిల్వర్ రెసిడెన్సీ పర్మిట్ ఉంటే..!

అబుధాబి: యూఏఈ కీలక ప్రటకన చేసింది. గల్ఫ్ దేశానికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్న వారికి తీపి కబురు చెప్పింది. కరోనా నిబంధనల నేపథ్యంలో ఇప్పటి వరకు యూఏఈ గోల్డెన్ వీసా ఉన్న వారిని మాత్రమే తమ దేశంలోకి అనుమతించిన యూఏఈ.. తాజాగా సిల్వర్ రెసిడెన్సీ పర్మిట్ కలిగిన వారికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. సిల్వర్ రెసిడెన్సీ పర్మిట్ కల్గిన ప్రయాణికులు భారత్ నుంచి యూఏఈకి రావొచ్చని తెలిపింది. అంతేకాకుండా నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల ప్రయాణికులు కూడా యూఏఈలోకి అడుగుపెట్టొచ్చని పేర్కొంది. 


Updated Date - 2021-06-17T06:16:03+05:30 IST