యూఏఈలో శ‌ర‌వేగంగా వ్యాక్సినేష‌న్‌.. ఇప్ప‌టికే 78 శాతం మందికి టీకాలు

ABN , First Publish Date - 2021-05-26T17:29:44+05:30 IST

యునైటెడ్ అర‌బ్ ఏమిరేట్స్‌(యూఏఈ)లో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది.

యూఏఈలో శ‌ర‌వేగంగా వ్యాక్సినేష‌న్‌.. ఇప్ప‌టికే 78 శాతం మందికి టీకాలు

అబుధాబి: యునైటెడ్ అర‌బ్ ఏమిరేట్స్‌(యూఏఈ)లో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే దేశవ్యాప్తంగా అర్హ‌త గ‌ల‌ 78.11 శాతం మందికి వ్యాక్సినేష‌న్ పూర్తైన‌ట్లు ఆ దేశ ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఇక టీకాలు తీసుకున్న‌వారంతా 16 ఏళ్లు ఆపైబ‌డిన వారేన‌ని అధికారులు తెలిపారు. దేశంలో క‌రోనా ప‌రిస్థితుల‌పై ప్ర‌తి వారం నిర్వ‌హించే స‌మీక్ష‌లో భాగంగా మంగ‌ళ‌వారం యూఏఈ ఈ వివ‌రాలు వెల్ల‌డించింది. అలాగే నిర్ధేశిత టార్గెట్ గ్రూపులో 84.59 శాతం మందికి ఇప్ప‌టికే వ్యాక్సినేష‌న్ పూర్తి చేసిన‌ట్లు అధికారులు స్ప‌ష్టం చేశారు. కాగా, మ‌హ‌మ్మారి నుంచి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డి మునుప‌టిలా సాధార‌ణ జీవ‌నమే ల‌క్ష్యంగా యూఏఈ జాతీయ టీకా కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగానే యూఏఈలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. 

Updated Date - 2021-05-26T17:29:44+05:30 IST