యూఏఈ హెల్త్ మినిస్టర్‌కు కొవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్

ABN , First Publish Date - 2020-09-20T14:37:10+05:30 IST

ట్రయల్ దశలో ఉన్న కొవిడ్ వ్యాక్సిన్‌ను మొదట ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్స్‌కు ఇవ్వనున్నట్లు ఇటీవల యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

యూఏఈ హెల్త్ మినిస్టర్‌కు కొవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్

యూఏఈ: ట్రయల్ దశలో ఉన్న కొవిడ్ వ్యాక్సిన్‌ను మొదట ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్స్‌కు ఇవ్వనున్నట్లు ఇటీవల యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా కొవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్‌ను శనివారం యూఏఈ ఆరోగ్యశాఖ మంత్రి అబ్దుల్ రహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ ఓవైస్ తీసుకున్నారు. "క్లినికల్ ట్రయల్స్‌లో వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇవ్వడం శుభపరిణామం. ఇప్పటివరకు జరిగిన వ్యాక్సిన్ ట్రయల్స్‌లో ఎలాంటి దుష్ప్రభావాలు చూపించలేదు. నేను ఇవాళ కొవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నాను. ఈ వ్యాక్సిన్‌ను మొదట తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలు చేస్తున్న ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్స్‌కు ఇవ్వాలని నిర్ణయించాం. దేశ ప్రజలను రక్షించడంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది" అని మంత్రి అన్నారు.


కాగా, కొవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో 125 జాతీయతలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 31వేల మంది వాలంటీర్లు పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. కొవిడ్-19 వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను యూఏఈ జూలై 16న అబుధాబిలో ప్రారంభించిన సంగతి తెలిసిందే.  

Updated Date - 2020-09-20T14:37:10+05:30 IST