UAE Golden Visa: పథకానికి సవరణలు.. వీసాదారులకు బోలేడు ప్రయోజనాలు!

ABN , First Publish Date - 2022-04-20T14:33:05+05:30 IST

యూఏఈ గోల్డెన్ వీసా పథకాన్ని తాజాగా సవరణలు చేసింది.

UAE Golden Visa: పథకానికి సవరణలు.. వీసాదారులకు బోలేడు ప్రయోజనాలు!

అబుదాబి: యూఏఈ గోల్డెన్ వీసా పథకాన్ని తాజాగా సవరణలు చేసింది. అర్హత ప్రమాణాలను సులభతరం చేయడంతో పాటు మరిన్ని కేటగిరీలకు ఈ వీసాలను విస్తరించడం లాంటి కీలక మార్పులు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా యూఏఈ చేసిన ఈ సవరణాల కారణంగా వీసాదారులకు బోలేడు ప్రయోజనాలు చేకూరనున్నాయి. ప్రధానంగా వీసాదారుల దీర్ఘకాలంపాటు యూఏఈ బయట ఉన్నా.. వారి వీసాపై ఎలాంటి ప్రభావం ఉండదు. అలాగే ఈ దీర్ఘకాలిక పదేళ్ల రెసిడెన్సీని ఇకపై పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, అసాధారణ ప్రతిభావంతులు, శాస్త్రవేత్తలు, నిపుణులు, అత్యుత్తమ విద్యార్థులు మరియు గ్రాడ్యుయేట్లు, మానవతా మార్గదర్శకులు, ఫ్రంట్‌లైన్ హీరోలకు మంజూరు చేయనుంది. వయసుతో సంబంధం లేకుండా, సంఖ్యతో సంబంధం లేకుండా గోల్డెన్ వీసాదారులు తమ కుటుంబ సభ్యుల్ని స్పాన్సర్ చేసుకోవచ్చు. ఈ వీసా కలిగిన వ్యక్తి చనిపోతే వారి కుటుంబ సభ్యులు యూఏఈలో నివాసం ఉండేందుకు కూడా అవకాశం కల్పించింది.   


అసలు Golden Visa అంటే ఏంటి..? 

వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం మంజూరు చేసేదే గోల్డెన్ వీసా. ఈ గోల్డెన్ వీసా ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలిక రెసిడెన్సీకి వీలు కలుగుతుంది. 2019లో యూఏఈ ప్రభుత్వం ఈ దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ యూఏఈలో విదేశీయులకు నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనంకు ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అలాగే వందశాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. ఇక యూఏఈ ఇచ్చే ఈ లాంగ్‌టర్మ్ వీసా 10, 5ఏళ్ల కాలపరిమితో ఉంటుంది. అంతేగాక ఆటోమెటిక్‌గా పునరుద్ధరించబడుతుంది.    


Updated Date - 2022-04-20T14:33:05+05:30 IST