UAE గోల్డెన్ వీసాదారులకు లక్కీ ఛాన్స్..!

ABN , First Publish Date - 2022-01-05T14:23:19+05:30 IST

యూఏఈ గోల్డెన్ వీసాదారులకు నిజంగా ఇది లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి.

UAE గోల్డెన్ వీసాదారులకు లక్కీ ఛాన్స్..!

దుబాయ్: యూఏఈ గోల్డెన్ వీసాదారులకు నిజంగా ఇది లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. ఎలాంటి డ్రైవింగ్ క్లాసుల్లేకుండా గోల్డెన్ వీసాదారులు దుబాయ్ డ్రైవింగ్ లైసెన్స్ పొందే చక్కటి అవకాశం. ఈ మేరకు రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ(ఆర్‌టీఏ) తాజాగా కీలక ప్రకటన చేసింది. యూఏఈ గోల్డెన్ వీసా కలిగినవారు డ్రైవింగ్ క్లాసులు లేకుండానే నేరుగా దుబాయ్ డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చని తన ప్రకటనలో పేర్కొంది. దీనికోసం స్వదేశంలో ఆమోదించబడిన మునుపటి డ్రైవింగ్ లైసెన్స్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో నాలెడ్జ్, రోడ్ టెస్ట్‌లలో ఉత్తీర్ణత సాధిస్తే ఆర్‌టీఏ కొత్త డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తుంది. గోల్డెన్ వీసాదారులు దుబాయ్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఆర్‌టీఏ వెబ్‌సైట్ ప్రకారం కింది ధృవ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. 

1. ఒరిజినల్ ఎమిరేట్స్ ఐడీ 

2. మునుపటి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కాపీ 

3.  నాలెడ్జ్ టెస్ట్ మరియు రోడ్ టెస్ట్ ఫలితాలు


ఇదిలాఉంటే.. వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేస్తుందనే విషయం తెలిసిందే. ఈ గోల్డెన్ వీసా ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలిక రెసిడెన్సీకి వీలు కలుగుతుంది. 2019లో యూఏఈ ప్రభుత్వం ఈ దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ యూఏఈలో విదేశీయులకు నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనంకు ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అలాగే వందశాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. ఇక యూఏఈ ఇచ్చే ఈ లాంగ్‌టర్మ్ వీసా 10, 5ఏళ్ల కాలపరిమితో ఉంటుంది. అంతేగాక ఆటోమెటిక్‌గా పునరుద్ధరించబడుతుంది. కాగా, 2019 నుంచి గతేడాది నవంబర్ వరకు మొత్తం 44వేల మంది గోల్డెన్ వీసా పొందారు.      

Updated Date - 2022-01-05T14:23:19+05:30 IST