యూఏఈ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ప్రోగ్రామింగ్ నిపుణుల సేవలకు గుర్తుగా..

ABN , First Publish Date - 2021-10-06T03:49:02+05:30 IST

యూఏఈ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అక్టోబర్ 29ని ప్రోగ్రామర్లకు అంకితమిస్తున్నట్టు ప్రకటించింది.

యూఏఈ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ప్రోగ్రామింగ్ నిపుణుల సేవలకు గుర్తుగా..

ఇంటర్నెట్ డెస్క్: నేటి సమాజంలో సాంకేతికత లేనిదే ఒక్క పనీ జరగదు. మనం నిత్యం వినియోగించే కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, యాప్స్, ఇతర అప్లికేషన్ల వెనుక ఎందరో ప్రోగ్రామింగ్ నిపుణుల కృషి దాగుంది. ఈ విషయాన్ని గుర్తిస్తూ యూఏఈ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అక్టోబర్ 29ని ప్రోగ్రామర్లకు అంకితమిస్తున్నట్టు  ప్రకటించింది. ప్రతి ఏటా ఈ రోజున దేశ ప్రజలందరూ ప్రోగ్రామింగ్ నిపుణుల విశేష కృషిని స్మరించుకోవాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్ఖూతూమ్ తాజాగా కీలక ప్రకటన చేశారు. 


20 ఏళ్ల క్రితం అక్టోబర్‌లో ఇదే రోజున..యూఏఈలో తొలి ఎలక్ట్రానిక్ పాలనా విధానానికి షేక్ మహ్మద్ శ్రీకారం చుట్టారు. యావత్ గల్ఫ్‌లో ఈ విధానం ప్రవేశ పెట్టిన తొలి దేశం యూఏఈ. ఈ కీలక మైలురాయికి సూచనగా.. ప్రధాని తాజాగా అక్టోబర్ 29ని ప్రోగ్రామర్లకు అంకితమిచ్చారు. ఇకపై ప్రతి ఏటా ఈ రోజున యూఏఈ అంతటా ప్రోగ్రామర్ల కృషిని గుర్తిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు జరగుతాయి. దుబాయ్ అభివృద్ధిలో సాఫ్ట్‌వేర్ నిపుణులు కీలక పాత్ర పోషించారని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-06T03:49:02+05:30 IST