అక్టోబర్ 29ను ప్రత్యేక వార్షిక గౌరవ దినంగా ప్రకటించిన UAE.. ఆ రోజు ప్రత్యేకత ఎంటంటే..

ABN , First Publish Date - 2021-10-06T18:49:11+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అక్టోబర్ 29ను ప్రత్యేక వార్షిక గౌరవ దినంగా ప్రకటించింది.

అక్టోబర్ 29ను ప్రత్యేక వార్షిక గౌరవ దినంగా ప్రకటించిన UAE.. ఆ రోజు ప్రత్యేకత ఎంటంటే..

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అక్టోబర్ 29ను ప్రత్యేక వార్షిక గౌరవ దినంగా ప్రకటించింది. 'యూఏఈ కోడ్స్' నినాదంలో భాగంగా అక్టోబర్ 29ను వార్షికంగా కోడింగ్, ప్రోగ్రామింగ్ నిపుణులను గౌరవించే రోజుగా పేర్కొంది. ఈ మేరకు యూఏఈ ప్రధాని, దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ తాజాగా ఈ ప్రకటన చేశారు.


ఈ సందర్భంగా షేక్ మహమ్మద్ మాట్లాడుతూ.. కోడింగ్, ప్రోగ్రామింగ్ ఎక్సలెన్స్ ఆవిష్కరణ అనేది సృజనాత్మకత, సాంకేతిక, శాస్త్రీయ నైపుణ్యం, ఆర్థిక వృద్ధితో పాటు దేశం భవిష్యత్తు ఆకాంక్షలకు కీలక డ్రైవర్ అని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో యూఏఈ ప్రభుత్వం భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కోడింగ్, ప్రోగ్రామింగ్‌లో నైపుణ్యం ఉన్నవారిని ప్రోత్సాహించేందుకు తాము మరిన్ని కార్యక్రమాలను చేపట్టబోతున్నట్లు తెలిపారు. 


అక్టోబర్ 29 ప్రత్యేకత ఇదే.. 

సరిగ్గా 20 ఏళ్ల కింద 2001 అక్టోబర్ 29న షేక్ మహమ్మద్ తొలిసారి దేశంలో 'ఎలక్ట్రానిక్ గవర్నమెంట్‌'ను ప్రారంభించారు. అంటే దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో మొదటిసారి డిజిటల్ విధానాన్ని పరిచయం చేశారు. అందుకే ఇకపై ప్రతియేటా అక్టోబర్ 29ను కోడింగ్, ప్రోగ్రామింగ్ నిపుణులను గౌరవించే రోజుగా జరుపుకోవాలని నిర్ణయించింది. రాబోయే రోజుల్లో డిజిటల్, సాంకేతిక రంగంలో మరింత అభివృద్ధి సాధించాలనే లక్ష్యానికి ఇది తోడ్పాటును అందిస్తుందని యూఏఈ నమ్ముతోంది. దేశ అభివృద్ధి వ్యూహంలో భాగంగా 'యాభై సంవత్సరాల చార్టర్'కు అనుగుణంగా 'నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కోడర్స్' వంటి కార్యక్రమాలు చేపడుతోంది. వీటి ద్వారా యూఏఈకి కొత్త తరం ప్రోగ్రామర్లు, కోడర్‌లను ఆకర్షించే దేశవ్యాప్త ప్రయత్నాలకు ఈ చర్య మద్దతు ఇస్తుందని పేర్కొంది.

Updated Date - 2021-10-06T18:49:11+05:30 IST