12-15 ఏళ్ల పిల్ల‌ల కోసం.. ఫైజ‌ర్ టీకాను ఆమోదించిన యూఏఈ

ABN , First Publish Date - 2021-05-14T15:52:45+05:30 IST

ఇటీవ‌ల అగ్రరాజ్యం అమెరికా పన్నెండేళ్ల నుంచి పదిహేనేళ్లలోపు పిల్లలకు ఫైజర్‌ కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ఆ దేశ‌ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) ఆమోదించిన విష‌యం తెలిసిందే.

12-15 ఏళ్ల పిల్ల‌ల కోసం.. ఫైజ‌ర్ టీకాను ఆమోదించిన యూఏఈ

అబుధాబి: ఇటీవ‌ల అగ్రరాజ్యం అమెరికా పన్నెండేళ్ల నుంచి పదిహేనేళ్లలోపు పిల్లలకు ఫైజర్‌ కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ఆ దేశ‌ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) ఆమోదించిన విష‌యం తెలిసిందే. తాజాగా గ‌ల్ఫ్ దేశం యూఏఈ కూడా 12-15 ఏళ్ల పిల్లలకూ ఫైజర్‌ టీకా ఇవ్వ‌డానికి ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు ఆ దేశ ఆరోగ్య‌శాఖ.. ఫైజ‌ర్‌-బ‌యోఎన్‌టెక్ సంయుక్తంగా రూపొందించిన క‌రోనా టీకాను 12-15 ఏళ్ల పిల్లల కోసం అత్య‌వ‌స‌ర వినియోగానికి ఆమోదం తెలుపుతూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. జాతీయ టీకా ప్ర‌ణాళిక సంఘం సూచ‌న‌తో పాటు ట్ర‌య‌ల్స్‌లో ఈ వ్యాక్సిన్ చూపిన ప్ర‌భావం, సామ‌ర్థ్యం ఆధారంగా వినియోగానికి అంగీక‌రించినట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఈ నిర్ణ‌యం మ‌హ‌మ్మారి నుంచి 12-15 ఏళ్ల పిల్లలను ర‌క్షించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని పేర్కొంది. ఇక ఇటీవ‌ల క‌రోనాపై పోరులో భాగంగా అబుధాబి ఆరోగ్య‌శాఖ‌, అబుధాబి ప‌బ్లిక్ హెల్త్ సెంట‌ర్‌(ఏడీపీహెచ్‌సీ), దుబాయ్ హెల్త్ అథారిటీ సంయుక్తంగా దేశ‌వ్యాప్తంగా నివాసితులు, దేశ పౌరుల కోసం ఉచిత టీకా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది. 


Updated Date - 2021-05-14T15:52:45+05:30 IST