UAE: ప్రైవేట్ సెక్టార్‌ ఉద్యోగులకు రంజాన్ పని వేళల ప్రకటన

ABN , First Publish Date - 2022-03-16T16:59:36+05:30 IST

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని యూఏఈ ప్రైవేట్ సెక్టార్‌ ఉద్యోగులకు మంగళవారం పని వేళలను ప్రకటించింది.

UAE: ప్రైవేట్ సెక్టార్‌ ఉద్యోగులకు రంజాన్ పని వేళల ప్రకటన

దుబాయ్: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని యూఏఈ ప్రైవేట్ సెక్టార్‌ ఉద్యోగులకు మంగళవారం పని వేళలను ప్రకటించింది. రంజాన్ సందర్భంగా ప్రైవేటు రంగ ఉద్యోగుల పని గంటలను రోజుకు రెండు గంటలు తగ్గించింది. ఈ మేరకు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఇక ఇటీవలే యూఏఈ ప్రభుత్వం ప్రభుత్వ రంగ ఉద్యోగులకు రంజాన్ మాసానికి సంబంధించి పని గంటలను ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు పనివేళలుగా నిర్ణయించింది. అలాగే శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పని గంటలు ఉంటాయి. రంజాన్ మాసం మొత్తం ఇవే పని గంటలను అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు పాటించాల్సి ఉంటుంది. కాగా, ఈసారి రంజాన్ మాసం ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే చంద్రవంక కనిపించే దానిబట్టి మే 1న రంజాన్ ఉపవాసాలు ముగుస్తాయి. మే 2న 'ఈద్ అల్ ఫితర్' మొదటి రోజు ఉండొచ్చని అంచనా. 



Updated Date - 2022-03-16T16:59:36+05:30 IST