ఆ ప్రవాసుల కోసం UAE ప్రత్యేక రెసిడెన్సీ వీసా..

ABN , First Publish Date - 2021-11-10T13:21:37+05:30 IST

వలసదారుల పట్ల యూఏఈ ప్రభుత్వం సానూకుల ధోరణితో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ప్రవాసుల కోసం పలు వీసా పథకాలను తీసుకొచ్చిన యూఏఈ తాజాగా రిటైర్ అయిన వారి కోసం ప్రత్యేక రెసిడెన్సీ వీసాకు ఆమోదం తెలిపింది. ఈ వీసా పథకం ద్వారా వలసదారులు పదవీ విరమణ తర్వాత కూడా యూఏఈలో నివాసం ఉండొచ్చు. యూఏఈ...

ఆ ప్రవాసుల కోసం UAE ప్రత్యేక రెసిడెన్సీ వీసా..

అబుధాబీ: వలసదారుల పట్ల యూఏఈ ప్రభుత్వం సానూకుల ధోరణితో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ప్రవాసుల కోసం పలు వీసా పథకాలను తీసుకొచ్చిన యూఏఈ తాజాగా రిటైర్ అయిన వారి కోసం ప్రత్యేక రెసిడెన్సీ వీసాకు ఆమోదం తెలిపింది. ఈ వీసా పథకం ద్వారా వలసదారులు పదవీ విరమణ తర్వాత కూడా యూఏఈలో నివాసం ఉండొచ్చు. యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని, దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆధ్వర్యంలో మంగళవారం భేటీ అయిన ఆ దేశ మంత్రివర్గం ఈ కొత్త వీసా పథకాన్ని ఆమోదించింది. దీంతో ఆ దేశంలో భారీ సంఖ్యలో ఉన్న రిటైర్డ్ వలసదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యూఏఈ సర్కార్ నిర్ణయం ఆహ్వానించదగినదిగా ప్రవాసులు పేర్కొంటున్నారు.


ఈ సందర్భంగా యూఏఈ ప్రధాని ట్విటర్ ద్వారా స్పందించారు. "ఇవాళ వలసదారులకు సంబంధించి కీలకమైన రెసిడెన్సీ పథకాన్ని ఆమోదించాము. రిటైర్డ్ విదేశీయులకు రెసిడెన్సీ వీసాలు మంజూరు చేయడానికి అవసరమైన పథకం ఇది. దీనివల్ల పదవీ విరమణ పొందిన తర్వాత కూడా ప్రవాసులు యూఏఈలో తమ బసను కొనసాగించవచ్చు. మా దేశంలో ఎల్లప్పుడూ అందరికీ ఆహ్వానం ఉంటుంది" అని బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ట్వీట్ చేశారు. 


ఈ వీసాకు అర్హులు వీరే..

1. ఆ దేశంలో సుమారు 1 మిలియన్ దిర్హమ్స్(సుమారు రూ.2కోట్లు) ఆస్తులు కలిగి ఉన్నవారు 

2. 1 మిలియన్ దిర్హమ్స్‌కు తక్కువ కాకుండా బ్యాంక్ డిపాజిట్లు ఉన్న పదవీ విరమణ పొందిన ప్రవాసులు 

3. సంవత్సరానికి రూ. 3.63కోట్లకు తక్కువ కాకుండా క్రియాశీల ఆదాయం ఉన్నవారు


Updated Date - 2021-11-10T13:21:37+05:30 IST