Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘ఇక వాళ్లతో పనిలేదు.. మీరే వచ్చి ఉద్యోగం చేసుకోండి’.. విదేశీ ఉద్యోగుల కోసం సరికొత్త VISA.. UAE బంపర్ ఆఫర్..

దుబాయ్: విదేశాల నుంచి వచ్చే ఉద్యోగులకు యూఏఈ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇకపై తమ దేశంలో పనిచేయాలనుకునేవారు ఉద్యోగం చేయాబోతున్న కంపెనీ నుంచి స్పాన్సర్‌షిప్ లేకుండానే వీసాలు పొదవచ్చని ప్రకటించింది. ఈ మేరకు వీసా నిబంధనలను సడలించినట్లు సోమవారం ప్రకటించింది. కోవిడ్ వల్ల దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పడేసేందుకే యూఏఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ‘గ్రీన్ వీసా’ అనే కొత్త రకం వీసాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.

యూఏఈలో పనిచేయాలనుకునేవారికి వీసాలు చాలా స్వల్ప సంఖ్యలోనే అందిస్తుంటుంది అక్కడి ప్రభుత్వం. అది కూడా అతడు పనిచేయబోతున్న సంస్థ యాజమాన్యం స్పాన్సర్ చేస్తేనే ఆ వీసా కూడా ఉద్యోగికి లభిస్తుంది. దీంతో అక్కడ నివాసం ఉండాలనుకునేవారు నానా అవస్థలు పడుతుంటారు. అయితే తాజాగా ప్రకటించిన గ్రీన్ వీసా ద్వారా కంపెనీల స్పాన్సర్‌షిప్ లేకుండానే యూఏఈకి వెళ్ళేందుకు విదేశీ ఉద్యోగులకు అనుమతి లభించనుంది. అంతేకాకుండా ఈ వీసాతో తమ తల్లిదండ్రులకు కూడా దాదాపు 25ఏళ్ల వరకు వీసా పొందేందుకు అవకాశం లభించనుంది.

ఈ వీసాకు సంబంధించిన వివరాలను యూఏఈ అంతర్జాతీయ వాణిజ్యశాఖా మంత్రి థాని అల్-జెయోడీ  వివరించారు. నిపుణులైన వ్యక్తులు, పెట్టుబడిదారులు, వివిధ వ్యాపారాలు చేసేవారు, భారీ స్థాయి వ్యాపారవేత్తలతో పాటు ప్రతిభ గల విద్యార్థులు, పోస్ట్ గ్రాడ్యుయేట్‌లను దృష్టిలో పెట్టుకుని ఈ వీసాను అమలులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఒకవేళ ఉద్యోగం కోల్పోవడం వల్ల కానీ, రిటైర్మెంట్ వల్ల కానీ ఎవరైనా ఉద్యోగులు వీసా ఏదైనా కారణాల వల్ల రద్దయినా.. దాదాపు 90 నుంచి 180 రోజులు యూఏఈ నివశించేందుకు కూడా వారికి అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.

ఇది దీనితో పాటు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, బ్లాక్ చెయిన్, డిజిటల్ కరెన్సీస్ వంటి ప్రత్యేకమైన రంగాల్లో నైపుణ్యం సాధించిన వ్యక్తిగత లేదా సొంతవ్యాపారుల కోసం ‘ఫ్రీలాన్స్ వీసా’ను అందిస్తున్నట్లు చెప్పారు. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement