మాదకద్రవ్యాల చట్టాన్ని సవరించిన UAE.. వారికి జైలుశిక్ష రద్దు!

ABN , First Publish Date - 2021-11-30T12:57:33+05:30 IST

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) కఠినమైన మాదకద్రవ్యాల చట్టాన్ని సవరించింది.

మాదకద్రవ్యాల చట్టాన్ని సవరించిన UAE.. వారికి జైలుశిక్ష రద్దు!

తొలిసారి పట్టుబడితే జైలుశిక్ష ఉండదు

దుబాయ్‌, నవంబరు 29: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) కఠినమైన మాదకద్రవ్యాల చట్టాన్ని సవరించింది. గంజాయిలోని ప్రధాన మత్తుపదార్థ రసాయనమైన టీసీహెచ్‌ను తమ దేశంలోకి తీసుకొచ్చే వారికి విధించే శిక్షలను సవరించింది. ఇకపై గంజాయితో చేసిన ఆహారపదార్థాలు, పానీయాలు, ఇతర పదార్థాలను తమ దేశంలోకి తీసుకొస్తూ తొలిసారి పట్టుబడే వారికి జైలు శిక్ష ఉండదని తెలిపింది. అధికారులు మాత్రం ఆ వస్తువులను స్వాధీనం చేసుకుని నాశనం చేస్తారని వెల్లడించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయంపై యూఏఈలో కఠినమైన ఆంక్షలున్నాయి. డ్రగ్స్‌ అక్రమ రవాణా చేసినా, వినియోగించినట్టు రుజువైనా ఇక్కడ నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తారు. 


Updated Date - 2021-11-30T12:57:33+05:30 IST