‘టైర్’కు పంక్చర్ ..!

ABN , First Publish Date - 2022-02-03T22:21:05+05:30 IST

కాంపిటీషన్ కమిషన్ ఆప్ ఇండియా(సీసీఐ) జరిమానా వేయడంతో టైర్ కంపెనీల్లోని కొన్నింటి షేర్లు ఈ రోజు(గురువారం) అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

‘టైర్’కు పంక్చర్ ..!

రూ. 5,500 కోట్లకు పైగా జరిమానా... 

కార్టలైజేషన్ ఫలితం... 

అదే బాటలో జేకే,ఎంఆర్ఎఫ్,బిర్లా టైర్స్...

హైదరాబాద్ : కాంపిటీషన్ కమిషన్ ఆప్ ఇండియా(సీసీఐ) జరిమానా వేయడంతో టైర్ కంపెనీల్లోని కొన్నింటి షేర్లు ఈ రోజు(గురువారం)  అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. కార్టలైజేషన్ చేసినందుకు గాను రూ. 1,788 కోట్ల మేర జరిమానాను సీసీఐ విధించింది. కాగా... ఐదు కంపెనీలు ఇలా కావాలనే తమకు సంబంధించిన కొన్ని బ్రాండ్ల , విభాగాల టైర్ల ధరలు పెంచినట్లు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇఁడియా నిర్ధారించింది. మార్కెట్లలో తమ ఉత్పత్తిని ఉద్దేశ్యపూర్వకంగానే  తగ్గించి, తద్వారా... ధరలు పెరగేందుకు కృత్రిమ డిమాండ్ పెంచాయంటూ జరిమానాను విధించింది. ఎంఆర్‌పీ పై రూ. 622 కోట్లు, అపోలో టైర్స్‌పై రూ. 4,25.5 కోట్లు, సియట్ టైర్లపై రూ. 252 కోట్లు జేకే టైర్స్‌పై రూ. 309.95 కోట్లు, బిర్లా టైర్స్‌పై రూ. 178.80కోట్ల జరిమానాను సిసిఐ విధించింది ఈ క్రమంలో... ఈ 5 కంపెనీల షేర్ల ధరలు ఈ రోజు(గురువారం) తగ్గుముఖం పట్టాయి. బిర్లా టైర్స్ ఇంట్రాడేలో రూ. 24.10 కు పతనమయ్యాయి. సియట్ షేర్లు రూ. 1,062.05 కు దిగిపోయి, ఆ తర్వాత కాస్త కోలుకున్నాయి. ఇక... జేకే టైర్స్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల ధర ఇంట్రాడేలో 5 శాతం పతనమై, రూ. 131 ధరను  తాకాయి. అపోలో టైర్స్ 5 శాతం పతనమై, రూ. .215.85 ధరకు దిగివచ్చాయి. ఇక షేర్లలో బాహుబలిలాంటి ఎంఆర్ఎఫ్ మాత్రం పతనాన్ని కాస్త తట్టుకుని పావు శాతం నష్టంతో ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. 

Updated Date - 2022-02-03T22:21:05+05:30 IST