త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-01-23T06:16:28+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నాదబ్రహ్మగా పేరుగాంచిన తాగ్యరాజస్వామివారిని స్మరిస్తూ వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో ఏడు దశాబ్దాలుగా ఆరాధనోత్సవాలను నిర్వహిస్తున్నారు.

త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ప్రారంభం
ప్రత్యేక పూజల మధ్య ఉత్సవాలు ప్రారంభిస్తున్న ఏఈవో బి.శ్రీనివాస్‌

వేములవాడ, జనవరి 22 : వేములవాడ  రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవాలు  ఘనంగా ప్రారంభమయ్యాయి. నాదబ్రహ్మగా పేరుగాంచిన తాగ్యరాజస్వామివారిని స్మరిస్తూ వేములవాడ  రాజరాజేశ్వర క్షేత్రంలో  ఏడు దశాబ్దాలుగా ఆరాధనోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఆలయ అర్చకులు స్వస్తిపుణ్యవచనము అనంతరం త్యాగరాజస్వామి చిత్రపటంతో నగర సంకీర్తన చేప ట్టారు. అనంతరం ఆలయ ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంగణలో ఏర్పాటు చేసిన ఆరాధనోత్సవాల వేదికపై త్యాగయ్య చిత్రపటం వద్ద ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ నేతృత్వంలోని అర ్చకుల బృందం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సహాయ కార్యనిర్వహణాఽదికారి బ్రహ్మన్నగారి శ్రీనివాస్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్ర్తీయ కళలను ప్రజలలోకి తీసుకువెళ్లడానికి  రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో ఏటా త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవాలను ఘనంగా నిర్వమిస్తున్నామన్నారు. తొలి రోజు కార్యక్రమాల్లో  భాగంగా ఉదయం చౌటి లక్ష్మణమూర్తి త్యాగరాజస్వామివారి సుప్రభాతం, వినిపించారు.  బుర్ర అరుణ, కే.పద్మ, కే.నరహరి, ఎస్‌.అనుపమ, బి.రేవతి, ఎస్‌.సునీత, కే.మంజుల, సంగీత బృందం పంచరత్నగానం చేశారు.   ఎస్‌వీఎస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సింహాచల శాస్త్రి భాగవతార్‌  త్యాగరాజ చరిత్రను హరికథ రూపంలో వినిపించారు. సాయంత్రం హైదరాబాద్‌కు చెందిన నాగూర్‌బాబు వేణువు కచేరి నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు నమిలికొండ ఉమేశ్‌శర్మ, దుమాల వాసు, ప్రతాప శ్రీనివాస్‌, అప్పాల రాజాచంద్ర, వేదపండితులు గర్శకుర్తి శ్రీధరశర్మ, సువర్ణ రాధాకృష్ణ, మధు హరీష్‌, ఉత్సవాల ఇన్‌చార్జి కొంటికర్ల రామయ్యశర్మ, మధు శ్రీనివాసశర్మ పాల్గొన్నారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా ఉత్సవాలను అంతరంగికంగా నిర్వహిసస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 

 


Updated Date - 2022-01-23T06:16:28+05:30 IST