Abn logo
Sep 21 2021 @ 00:28AM

ద్విచక్ర వాహనం బోల్తా - యువకుడి మృతి

మృతుడు సురేష్‌

ఉరవకొండ, సెప్టెంబరు 20: పట్టణ శివారులోని హోతూరు రోడ్డు హంద్రీనీవా డిసి్ట్రబ్యూటరీ కాలువ పక్కన ఉన్న మ ట్టి దిబ్బను ద్విచక్ర వాహ నం ఢీకొని యువకుడు  సురేష్‌ (25) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివ రాలివి. సురేష్‌ తట్రగల్లుకు చెందిన గాలిమరల సబ్‌స్టేషనలో పనిచేస్తున్నాడు. ఆదివారం పని నిమిత్తం హోతూరుకు వెళ్లాడు. ఫంక్షన ఉందని, కుటుంబ సభ్యులు రావాలని ఫోన చేశారు. ద్విచక్ర వాహనంలో తట్రగల్లుకు బ యలుదేరగా, రాత్రి హంద్రీనీవా డిసి్ట్రబ్యూటరీ కాలువ ప క్కన ఉన్న మట్టి దిబ్బను ఢీకొన్నాడు. ప్రమాదంలో ద్విచక్రవాహనం బోల్తా పడి సురేష్‌ కాలువలో పడ్డాడు. ఎం తసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులంతా గాలించారు. సోమవారం ఉదయం కాలువలో మృతదే హాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి మృతుడు సురేష్‌గా గుర్తించా రు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉరవకొండ ప్ర భుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.