కూతుళ్లను స్కూటీపైనే ఉంచి మార్కెట్‌లోకి వెళ్లడమే ఆ భార్యాభర్తలు చేసిన పొరపాటయింది.. క్షణాల్లోనే ఊహించని ఘోరం..!

ABN , First Publish Date - 2022-05-19T22:01:11+05:30 IST

ఆ దంపతులకు కొన్నేళ్ల క్రితమే పెళ్లైంది. వారి అనోన్య జీవితానికి గుర్తుగా ఇద్దరు కూతుళ్లు జన్మించారు. ప్రస్తుతం ఒక కూతురు వయసు 10ఏళ్లు కాగా.. మరో కూతరు వయసు 2 సంవత్సరాలు. ఈ క్రమం

కూతుళ్లను స్కూటీపైనే ఉంచి మార్కెట్‌లోకి వెళ్లడమే ఆ భార్యాభర్తలు చేసిన పొరపాటయింది.. క్షణాల్లోనే ఊహించని ఘోరం..!

ఇంటర్నెట్ డెస్క్: ఆ దంపతులకు కొన్నేళ్ల క్రితమే పెళ్లైంది. వారి అనోన్య జీవితానికి గుర్తుగా ఇద్దరు కూతుళ్లు జన్మించారు. ప్రస్తుతం ఒక కూతురు వయసు 10ఏళ్లు కాగా.. మరో కూతరు వయసు 2 సంవత్సరాలు. ఈ క్రమంలో ఆ భార్యభర్తలు చేసిన ఓ చిన్న పొరపాటు.. వారి జీవితాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన భార్యభర్తలు తమ ఇద్దరు కూతుళ్లతో స్థానికంగా నివసిస్తున్నారు. ఈ దంపతులు ఎప్పటిలాగే కూరగాయలు కొనడానికి కూతుళ్లను వెంటబెట్టుకుని మార్కెట్‌కు వెళ్లారు. స్కూటీ రోడ్డు పక్కన పార్క్ చేసి, కూతుళ్లను బండిపైనే ఉంచి భార్యభర్తలు ఇద్దరూ మార్కెట్‌కు వెళ్లారు. అదే వాళ్లు చేసిన తప్పైంది. అటుగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి మృతి చెందగా.. 10ఏళ్ల అమ్మాయి తీవ్రంగా గాయపడింది. ఈ దుర్ఘటనతో ఆ దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు.. దర్యాప్తు ప్రారంభించారు. 


Updated Date - 2022-05-19T22:01:11+05:30 IST