అందరి సహకారంతో రెండేళ్లు విజయవంతం

ABN , First Publish Date - 2020-09-29T06:32:13+05:30 IST

ఆరోగ్య సమాజ స్థాపన దిశగా జిల్లాలోని వైద్య సిబ్బంది కృషి చేస్తున్నారని, అందరి సహకారంతో తాను జిల్లాలో రెండేళ్ల పదవీ

అందరి సహకారంతో రెండేళ్లు విజయవంతం

‘ఆంధ్రజ్యోతి’తో డీఎంహెచ్‌ భాస్కర్‌ నాయక్‌


కొత్తగూడెం కలెక్టరేట్‌, సెప్టెంబరు 28: ఆరోగ్య సమాజ స్థాపన దిశగా జిల్లాలోని వైద్య సిబ్బంది కృషి చేస్తున్నారని, అందరి సహకారంతో తాను జిల్లాలో రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నానని డీఎంహెచ్‌వో భాస్కర్‌ నాయక్‌ అన్నా రు. డీఎంహెచ్‌వోగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లా డారు. ప్రస్తుతం చేపట్టిన వైద్య సేవల కారణంగా అంటు వ్యాధులను అదుపులో ఉంచగలిగామని, ప్రాణాంతక మైన కరోనా నియంత్రణలోనూ జిల్లా వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది ఆహర్నిషలు శ్రమించి కరోనా వ్యాధిని అరికట్టగలిగామని తెలిపారు. అత్యవసర సేవలకై నాలుగు 108 వాహనాలను భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో సిద్ధంగా ఉంచడంతో పాటు భధ్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డు ఏర్పా టుచేసి సుమారు 200 మంది వైద్యసిబ్బంది మూడు రోజుల పాటు నవమికి వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించారన్నారు. 2019 డిసెంబర్‌లో కోవిడ్‌ -19 అనే కొత్త వ్యాధిని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిం దన్నారు.


సుమారు మూడు నెలల పాటు ఒక్క కేసు కూడా నమోదు కాకుండా చర్యలు తీసుకోవడంతో త్వరిత గతిన గ్రీన్‌జోన్‌గా తీసుకొచ్చిన ఘనత వైద్య సిబ్బంది సమిష్టి కృషి అన్నారు. జిల్లాలో నూరుశాతం ఇమ్యునైజేషన్‌ కార్యక్రమం విజయవంతం చేయడం, పటిష్టంగా కేసీఆర్‌ కి ట్స్‌ అమలు, 85శాతం ఆస్పత్రి కాన్పులు జరుగుతు న్నాయని, నూరుశాతం చేసేందుక కృషి చేస్తున్నామన్నారు.  మారుమూల గ్రామాల్లో గొత్తికోయల  ఆవాస ప్రాంతాల్లో సమగ్ర ఆరోగ్య సేవలు అందించండం, వారికి ఆరోగ్యసేవలు విజయవంతం చేయడం చేస్తున్నామన్నారు. 


ప్రభుత్వం చే పట్టిన కాయకల్ప ప్రొగ్రాం ద్వారా అన్ని ప్రభుత్వ ఆస్ప త్రుల్లో సౌకర్యాలు మెరుగు పరచడం, సుందరంగా తీర్చి దిద్ద్డడం జరిగిందన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి రోజు బయటి రోగులకు ఆరోగ్య సేవలు అందింస్తున్నామన్నారు. లెప్రసీ, ఎయిడ్స్‌పై స్లాక్‌, ఎల్పీడీసీ ప్రొగ్రాములు, కళాజాత బృందాలతో అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజల్ని చైతన్యపరుస్తున్నట్లు తెలి పా రు. జిల్లాలో చేపడుతున్న ఆరోగ్య సేవల ద్వారా ప్రస్తుతం జిల్లాలో ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన దిశగా జిల్లా ముందుకు  సాగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది సమష్టి  కృషి ఫలితమని డీఎంహెచ్‌వో పేర్కొన్నారు.

Updated Date - 2020-09-29T06:32:13+05:30 IST