‘పురం’లో రెండేళ్లుగా పడకేసిన అభివృద్ధి

ABN , First Publish Date - 2021-03-02T07:09:04+05:30 IST

హిందూపురం వాణిజ్యకేంద్రంగా పేరుగాంచింది. తెలుగు రాష్ట్రాల్లో హిందూపురం పేరు విననివారున్నారంటే అతిశయోక్తికాదు.

‘పురం’లో రెండేళ్లుగా పడకేసిన అభివృద్ధి
పూర్తికాని కూరగాయల మార్కెట్‌

-వెంటాడుతున్న ప్రధాన సమస్యలు

- రూ.లక్షతో రోడ్డు వేయని వైనం 

హిందూపురం టౌన, మార్చి 1: హిందూపురం వాణిజ్యకేంద్రంగా పేరుగాంచింది. తెలుగు రాష్ట్రాల్లో హిందూపురం పేరు విననివారున్నారంటే అతిశయోక్తికాదు. కానీ రెండేళ్లుగా హిందూపురం పట్టణ అ భివృద్ధి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది. ఎమ్మె ల్యే నందమూరి బాలకృష్ణ గత ఐదేళ్లలో రూ.వందల కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. ముఖ్యంగా హిం దూపురానికి తలమానికంగా రూ.23 కోట్లతో  కూరగాయల మా ర్కెట్‌ నిర్మాణం చేపట్టారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక దీనిపై దృష్టిసారించలేదు. దీంతో ఇంకా పనులు జరగాల్సి ఉంది. అదేవిధంగా మునిసిపాలిటీలో సుమారు 2లక్షల దాకా జనాభా నివసిస్తున్నారు. ఇంతమందికి తగ్గట్టుగా మార్కెట్‌ సదుపాయం గమనించిన బాలకృష్ణ, 2016లో పాత మార్కెట్‌ స్థానంలో కొత్త మార్కె ట్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సార్వత్రిక ఎన్నికల తరువాత వైసీపీ అధికారంలోకి రావడంతో మార్కెట్‌ పనిపూర్తీచేస్తే టీడీపీకి మంచి పేరు వస్తుందని భావించి నత్తకు నడక నేర్పేవిధంగా మార్కెట్‌ పనులు సాగుతున్నాయి. ఎంజీఎం క్రీడా మైదానంలో రూ.2కోట్లు నిధులు తీసుకొచ్చి 2018మార్చిలో పనులు ప్రారంభించారు. అయితే అదికూడా పూర్తీచేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉండటం గమనార్హం. దీంతోపాటు పట్టణంలో మట్టిరోడ్లు లేకుండా డ్రైనేజీలు నిర్మాణం చేసేందుకు బాలకృష్ణ ప్రత్యేక కృషిచేసి రూ.66వేలు నిధులు తీసుకొచ్చారు. ఎన్నికలు రావడంతో ఆ పపనులు ఆగిపోయాయి. నిధులు తీసుకురావడంలో వైసీపీ పాలకులు విఫలమయ్యారు.


                   



Updated Date - 2021-03-02T07:09:04+05:30 IST