బ్యాంకు చీఫ్‌ మేనేజర్‌కు రెండేళ్ల జైలు

ABN , First Publish Date - 2020-02-02T05:51:28+05:30 IST

నకిలీ పత్రాల ఆధారంగా రుణం మంజూరు చేసిన కేసులో.. ఎస్‌బీహెచ్‌ (ప్రస్తుతం ఎస్‌బీఐలో విలీనమైంది) చీఫ్‌ మేనేజర్‌ కె.మురళికి సీబీఐ మూడో అదనపు ప్రత్యేక కోర్టు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది

బ్యాంకు చీఫ్‌ మేనేజర్‌కు రెండేళ్ల జైలు

ఇద్దరు ప్రైవేట్‌ వ్యక్తులకు కూడా...

నకిలీ పత్రాల ఆధారంగా రుణం మంజూరు చేసిన కేసులో.. ఎస్‌బీహెచ్‌ (ప్రస్తుతం ఎస్‌బీఐలో విలీనమైంది) చీఫ్‌ మేనేజర్‌ కె.మురళికి సీబీఐ మూడో అదనపు ప్రత్యేక కోర్టు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రూ.40 వేలు జరిమానా చెల్లించాలని, లేకపోతే మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొంది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ప్రైవేట్‌ వ్యక్తులు కె.ధనుంజయ్‌రెడ్డి, ఎస్‌.వంశీకృష్ణకు కూడా రెండేళ్ల జైలు శిక్ష, రూ.30 వేలు జరిమానా విధించింది. రవీంద్ర ఫౌలీ్ట్రఫాంకు రూ.30 వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. రవీంద్ర ఫౌలీ్ట్రఫాం యజమాని రవీందర్‌రెడ్డితోపాటు మరికొందరితో బ్యాంకు చీఫ్‌ మేనేజర్‌ కుమ్మక్కై రుణం మంజూరు చేయడం ద్వారా బ్యాంక్‌కు రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీబీఐ పేర్కొంది. ఈ కేసు విచారణలో ఉండగానే రవీందర్‌రెడ్డి చనిపోయారని, దాంతో ఆయన్ను ఈ కేసు నుంచి తొలగించారు.

Updated Date - 2020-02-02T05:51:28+05:30 IST