Abn logo
Sep 18 2021 @ 11:41AM

పొట్టిగా ఉన్నావు.. నీతో కాపురం చేయలేను.. ప్రేమ పెళ్లి చేసుకున్న రెండేళ్ల తర్వాత ఓ భర్త మాటలివి..

ఆమెను అతడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. రెండు సంవత్సరాలు కాపురం చేశాడు.. రెండు సంవత్సరాల కాపురం తర్వాత ఆమె పొట్టిగా ఉందనే కారణం చెప్పి అతడు ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు.. దీంతో ఆమె అతడి ఇంటి ముందు ధర్నా చేసింది.. విషయం పోలీసుల వరకు చేరడంతో ఇరు కుటుంబాల మధ్య వారు రాజీ కుదిర్చారు.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


మీరట్‌లోని బ్రహ్మపురి ప్రాంతానికి చెందిన ప్రీతమ్ కపూర్, భావన రెండు సంవత్సరాల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అనంతరం రెండేళ్ల పాటు సంతోషంగా కలిసి జీవించారు. తాజాగా భావనను ప్రీతమ్ ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. `నువ్వ పొట్టిగా ఉన్నావు.. నీతో కాపురం చేయలేన`ని చెప్పి ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. అయితే భావన.. ప్రీతమ్ ఇంటి ముందే ధర్నా మొదలుపెట్టింది. దీంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది. 


ఇవి కూడా చదవండి

పెళ్లికి రెడీ అవుతున్న వీళ్లిద్దరి జీవితాలు రాత్రికి రాత్రే తారుమారు



మహిళా SIకూ తప్పని లైంగిక వేధింపులు.. పోలీస్ స్టేషన్‌లోనే



దీంతో ఇరు కుటుంబాల వారినీ పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. పెళ్లి జరిగిన తర్వాతి నుంచి అత్తింటి వారు తనను కట్నం కోసం వేధిస్తున్నారని, ఇటీవల భర్త కూడా వారితో చేరాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఇరు కుటుంబాల మధ్య పోలీసులు రాజీ కుదిర్చారు. ప్రీతమ్ కుటుంబ సభ్యులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో భావనను ఇబ్బంది పెడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీంతో ప్రీతమ్ కుటుంబ సభ్యులు భావనను ఇంటికి తీసుకెళ్లారు.  

ప్రత్యేకంమరిన్ని...