HYD : Car కు సైడ్‌ ఇవ్వలేదని బస్సు డ్రైవర్‌‌పై ఇద్దరు మహిళల దాడి

ABN , First Publish Date - 2022-02-20T14:59:37+05:30 IST

కారుకు సైడ్‌ ఇవ్వలేదని అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు..

HYD : Car కు సైడ్‌ ఇవ్వలేదని బస్సు డ్రైవర్‌‌పై ఇద్దరు మహిళల దాడి

హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట : కారుకు సైడ్‌ ఇవ్వలేదని అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు, డ్రైవర్‌ కలిసి బస్సు డ్రైవర్‌, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. లక్డీకపూల్‌ నుంచి కూకట్‌పల్లి వైపునకు వెళ్తున్న ప్రైవేట్‌ బస్సును ఓ కారు ఓవర్‌టేక్‌ చేసేందుకు ప్రయత్నించింది. బస్సు డ్రైవర్‌కు సైడ్‌ ఇవ్వడానికి వీలుకాలేదు. కొద్ది దూరం వెళ్లాక కార్‌ డ్రైవర్‌  బస్సును ఓవర్‌టేక్‌ చేసి బస్సు ముందు నిలిపాడు. కారులో నుంచి ఇద్దరు మహిళలు, డ్రైవర్‌ దిగి బస్సులోకి వెళ్లి డ్రైవర్‌పై దాడిచేశారు. బస్సులో ఉన్న అతడి సహాయకుడిని కూడా కొట్టారు.


వారి నుంచి తప్పించుకున్న బస్సు డ్రైవర్‌ కిందికి దిగి కారు తాళాలు తీసుకున్నాడు. ఈ సమయంలో మరికొంతమంది వచ్చి డ్రైవర్‌ను చితకబాదారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ సూరజ్‌, సిబ్బంది వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. వారు పోలీసులపైకి దాడికి దిగారు. మరి కొంతమంది సిబ్బంది సాయంతో వారిని చెదరగొట్టారు. తనను కొట్టారని యాకుత్‌పురాకు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బస్సు డ్రైవర్‌ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2022-02-20T14:59:37+05:30 IST