గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళల అరెస్టు

ABN , First Publish Date - 2022-08-12T05:41:15+05:30 IST

అక్రమంగా గంజాయిని రవాణ చేస్తున్న ఇద్దరు మహిళలను ఆర్టీసీ బస్టాండ్‌లో ఒకటో టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 4 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం పోలీసు కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు విలేకరులకు వివరాలు వెల్లడించారు. కచ్చితమైన సమాచారం మేరకు ఉదయం ఆర్టీసీ బస్టాండ్‌లో అనుమానంగా కనిపించిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారించారని తెలిపారు. వారి వద్ద అక్రమంగా రవాణ చేయడానికి ఉన్న ఎండుగంజాయి లభించిందన్నారు. శాంతాబాయి, లండిగావాద్‌ కల్పన ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన వారుగా గుర్తించామని తెలిపా రు. నేరం అంగీకరించడంతో స్థానిక తహసీల్దార్‌ సమక్షంలో వారిపై కేసునమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. వారిని పట్టుకోవడంలో నైపుణ్యత చూపిన ఒకటో టౌన్‌ ఎస్‌హెచ్‌వో డి.విజయ్‌బాబు, టాస్స్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశం, ఎస్సైలు నర్సింహులు, శ్రావన్‌కుమార్‌, సిబ్బంది నా రాయణ, రాజేష్‌, స్వామి, అనిల్‌, భూషన్‌రాజ్‌లను సీపీ అభినందించారు.

గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళల అరెస్టు

ఖిల్లా, ఆగస్టు  11: అక్రమంగా గంజాయిని రవాణ చేస్తున్న ఇద్దరు మహిళలను ఆర్టీసీ బస్టాండ్‌లో ఒకటో టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 4 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం పోలీసు కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు విలేకరులకు వివరాలు వెల్లడించారు. కచ్చితమైన సమాచారం మేరకు ఉదయం ఆర్టీసీ బస్టాండ్‌లో అనుమానంగా కనిపించిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారించారని తెలిపారు. వారి వద్ద అక్రమంగా రవాణ చేయడానికి ఉన్న ఎండుగంజాయి లభించిందన్నారు. శాంతాబాయి, లండిగావాద్‌ కల్పన ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన వారుగా గుర్తించామని తెలిపా రు. నేరం అంగీకరించడంతో స్థానిక తహసీల్దార్‌ సమక్షంలో వారిపై కేసునమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. వారిని పట్టుకోవడంలో నైపుణ్యత చూపిన ఒకటో టౌన్‌ ఎస్‌హెచ్‌వో డి.విజయ్‌బాబు, టాస్స్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశం, ఎస్సైలు నర్సింహులు, శ్రావన్‌కుమార్‌, సిబ్బంది నా రాయణ, రాజేష్‌, స్వామి, అనిల్‌, భూషన్‌రాజ్‌లను సీపీ అభినందించారు. 


Updated Date - 2022-08-12T05:41:15+05:30 IST