ఇద్దరు భార్యలు వదిలేసి వెళ్లిపోతే.. వయసులో 15 ఏళ్లు చిన్న అయిన మహిళతో మూడో పెళ్లి.. చివరకు ఊహించని ట్విస్ట్..!

ABN , First Publish Date - 2022-09-17T21:32:51+05:30 IST

అతనికి రెండు సార్లు వివాహాలు జరిగాయి.. అతడి ప్రవర్తనను భరించలేక ఇద్దరూ అతడిని వదిలేసి వెళ్లిపోయారు..

ఇద్దరు భార్యలు వదిలేసి వెళ్లిపోతే.. వయసులో 15 ఏళ్లు చిన్న అయిన మహిళతో మూడో పెళ్లి.. చివరకు ఊహించని ట్విస్ట్..!

అతనికి రెండు సార్లు వివాహాలు జరిగాయి.. అతడి ప్రవర్తనను భరించలేక ఇద్దరూ అతడిని వదిలేసి వెళ్లిపోయారు.. చివరకు తన ఊరికే చెందిన, తన కంటే వయసులో 15 ఏళ్లు చిన్నదైన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు.. ఈ నెల 12వ తేదీన అతను మరణించాడు.. ఓ గోనె సంచిలో అతని మృతదేహం లభ్యమైంది.. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేసిన పోలీసులు అతడి మూడో భార్యను నిందితురాలిగా తేల్చారు.. భర్త పెట్టే టార్చర్ భరించలేక హత్య చేశానని ఆమె పోలీసుల ఎదుట అంగీకరించింది. మధ్యప్రదేశ్‌ (Madhya pradesh)లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

KBC Show: కేబీసీ షోలో కోటి రూపాయలు గెలిచారు కదా.. వాటితో ఏం చేస్తారు.. అని ఈ సాధారణ గృహిణిని అడిగితే..


ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌కి చెందిన దేవేంద్ర అగర్వాల్ (36) ఇండోర్‌లో నివసిస్తున్నాడు. అతనికి గతంలో రెండు సార్లు వివాహాలు జరిగాయి. అయితే ఆ ఇద్దరూ మహిళలూ దేవేంద్రను వదిలేసి వెళ్లిపోయారు. చివరకు తన గ్రామానికే చెందిన 19 ఏళ్ల నేహను రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అప్పటికే భర్తను పోగొట్టుకుని ఓ కూతురితో ఉంటున్న నేహ తల్లిదండ్రుల బలవంతంతో దేవేంద్రను పెళ్లి చేసుకుంది. పెళ్లైన ఏడాది వరకు దేవేంద్ర ఆమెను బాగానే చూసుకున్నాడు. ఆ తర్వాత అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. రోజూ ఏదో విషయంలో గొడవ పెట్టుకుని భార్యను కొట్టేవాడు. గర్భధారణ సమయంలో కూడా, నేహను దేవేంద్ర చాలాసార్లు కొట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత కూడా అతని టార్చర్ ఆగలేదు. 


ఆ సమయంలో దేవేంద్ర మేనల్లుడు విక్కీ ఆమెకు అండగా ఉండేవాడు. క్రమంగా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఆ విషయం తెలుసుకున్న దేవేంద్ర.. విక్కీని చంపేస్తానని బెదిరించాడు. ఈ నెల 12వ తేదీన నేహను విపరీతంగా కొట్టాడు. అదే రోజు రాత్రి విక్కీ, నేహ కలిసి దేవేంద్ర గొంతు నులిమి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో వేసి ఏరోడ్రోమ్ ప్రాంతంలో పారేశారు. దేవేంద్ర సోదరుడు ఆత్మారామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేహ, ఆమె ప్రియుడు విక్కీపై అనుమానం వ్యక్తం చేశాడు. వారు పరారీలో ఉండడంతో పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. రెండ్రోజుల తర్వాత ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వారు తమ నేరం అంగీకరించారు. 

Updated Date - 2022-09-17T21:32:51+05:30 IST