శ్రీనగర్: సెంట్రల్ కశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లా రంగ్రెత్ ఏరియాలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు సోమవారనాడు మట్టుబెట్టాయి. ఉగ్రవాదులు సంచరిస్తున్న సమాచారంతో బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్చాయి. ఈ క్రమంలో బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమైనట్టు అధికారులు తెలిపారు. దీనికి ముందు ఆదివారంనాడు అవంతిపోరలోని బారాగామ్ ఏరియాలో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయి.