encounter: జమ్మూకశ్మీరులో ఇద్దరు ఉగ్రవాదుల హతం

ABN , First Publish Date - 2021-07-16T13:19:29+05:30 IST

జమ్మూకశ్మీరులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటరులో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు...

encounter: జమ్మూకశ్మీరులో ఇద్దరు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటరులో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు.జమ్మూకశ్మీరులోని డన్మార్ అలందర్ కాలనీలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర కేంద్ర భద్రతా బలగాలు శుక్రవారం తెల్లవారుజామున గాలింపు ప్రారంభించాయి. గాలిస్తున్న జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మరణించారని కశ్మీరు పోలీసు జోన్ ఐజీ చెప్పారు. ఉగ్రవాదుల కోసం అలందర్ కాలనీలో ఆర్మీ గాలింపు కొనసాగిస్తోంది. గుర్తుతెలియని ఉగ్రవాదులను గుర్తించేందుకు పోలీసులు వారి గురించి ఆరా తీస్తున్నారు. 

Updated Date - 2021-07-16T13:19:29+05:30 IST