గోవధ చేస్తున్నారన్న నెపంతో ఇద్దరు గిరిజన వ్యక్తులపై దాడి, మృతి

ABN , First Publish Date - 2022-05-04T02:02:53+05:30 IST

సుమారు 20 మంది వ్యక్తులు కర్రలు, ఇతర బలమైన ఆయుధాలతో దాడి చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కాగా, ముగ్గురు అనుమానితుల్ని ఇప్పటికే అరెస్ట్ చేసి విచారిస్తున్నామని, మిగతా వారి కోసం దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసు అధికారి మారావి తెలిపారు..

గోవధ చేస్తున్నారన్న నెపంతో ఇద్దరు గిరిజన వ్యక్తులపై దాడి, మృతి

భోపాల్: గోరక్షక దళాల పేరుతో రెండేళ్ల క్రితం వరకు దేశంలో అనేక మూడు దాడులు, హత్యలు జరిగాయి. పరిస్థితులు కాస్త బాగానే ఉన్నాయని అనుకునే లోపే మరోసారి ఈ మూకలు రెచ్చిపోయాయి. గోవుల్ని కబేళాలకు తరలిస్తున్నారన్న నెపంతో ఇద్దరు గిరిజన వ్యక్తుల్ని తీవ్రంగా కొట్టిచంపారు. కాగా, ఇదే ఘటనలో మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, వారిని కొట్టిచంపింది Bajrang Dal కార్యకర్తలేనని Congress పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సెయిని జిల్లా సిమరియా ప్రాంతంలో అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. సుమారు 20 మంది వ్యక్తులు కర్రలు, ఇతర బలమైన ఆయుధాలతో దాడి చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కాగా, ముగ్గురు అనుమానితుల్ని ఇప్పటికే అరెస్ట్ చేసి విచారిస్తున్నామని, మిగతా వారి కోసం దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసు అధికారి మారావి తెలిపారు.

Read more