Jammu and Kashmirలో రెండు ఉగ్రవాద గ్రూపుల గుట్టురట్టు

ABN , First Publish Date - 2022-02-09T13:16:03+05:30 IST

జమ్మూకశ్మీరులోని అనంత్‌నాగ్ జిల్లాల్లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన రెండు డంప్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు....

Jammu and Kashmirలో రెండు ఉగ్రవాద గ్రూపుల గుట్టురట్టు

 11 మంది జైషే మహ్మద్ ఉగ్రవాదుల అరెస్ట్ 

అనంత్‌నాగ్ : జమ్మూకశ్మీరులోని అనంత్‌నాగ్ జిల్లాల్లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన రెండు ముఠాల గుట్టును  పోలీసులు రట్టు చేశారు. ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురు ఉగ్రవాదులతో సహా 11మంది నిందితులను అరెస్ట్ చేశారు.అనంతనాగ్‌లోని శ్రీగుఫ్వారా బిజ్‌బెహరా ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా బలగాలపై దాడి చేయడానికి నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉగ్రవాదసంస్థ యోచిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేర పోలీసులు దాడులు చేశారు.శ్రీగుఫ్వారా గ్రామంలోని సఖ్రాస్ క్రాసింగ్ వద్ద చెక్‌పాయింట్‌లో తనిఖీ చేస్తున్నప్పుడు, బైక్‌పై ముగ్గురు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించగా వారిని అడ్డగించి పట్టుకున్నారు.


నిందితులను తనిఖీ చేయగా రెండు పిస్టల్స్ (చైనీస్)తో పాటు మ్యాగజైన్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.నిందితులు లివర్ నివాసి అబ్బాస్ అహ్ ఖాన్, విడ్డేకు చెందిన జహూర్ అహ్ గౌగుజ్రీ, లివర్ పహల్గామ్ నివాసి హిదయతుల్లా కుతాయ్ లని పోలీసులు చెప్పారు. తాము జేఈఎం సహచరులమని, పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్‌లతో తమకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని, వారి ఆదేశానుసారం శ్రీగుఫ్వారా ప్రాంతంలో పోలీసు భద్రతా బలగాలపై దాడి చేసేందుకు ఉగ్రవాద సంస్థలో చేరబోతున్నామని కూడా నిందితులు వెల్లడించారు.శ్రీగుఫ్వారా నివాసి షకీర్ అహ్మద్ గౌగోజ్రీ, కట్సూ శ్రీగుఫ్వారాకు చెందిన ముషారఫ్ అమీన్ షా అనే మరో ఇద్దరు తీవ్రవాద సహచరులను అరెస్టు చేశారు. 


వారి వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.అనంతనాగ్ పోలీసులు బిజ్‌బెహరా ప్రాంతంలో మరో ఆరుగురు తీవ్రవాద సహచరులను అరెస్టు చేయడం ద్వారా మరో టెర్రర్ మాడ్యూల్‌ను ఛేదించారు. వారివద్ద నుంచి మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.ఫయాజ్ అహ్ ఖాన్, ముంతజీర్ రషీద్ మీర్, మహ్మద్ ఆరిఫ్ ఖాన్, ఆదిల్ అహ్ తర్రే, జాహిద్ అహ్మద్ నజర్‌ లను నిందితులుగా గుర్తించారు.

Updated Date - 2022-02-09T13:16:03+05:30 IST