రెండు ఆలయాల్లో చోరీలు

ABN , First Publish Date - 2021-06-22T07:02:24+05:30 IST

అద్దంకి మండలం కుంకుపాడు, కారంచేడు మండలం తిమిడిదపాడు గ్రామాల్లోని పోలే రమ్మ తల్లి దేవాలయాల్లో ఆదివారం రాత్రి చోరీలు జరిగాయి. గుర్తుతెలియని దుండగులు ఆలయాల్లోని హుండీలను పగులగొట్టి అందులోని కానుకలను అపహరించుకుపోయారు.

రెండు ఆలయాల్లో చోరీలు
నమూనాలు సేకరిస్తున్న ఒంగోలు క్లూస్‌ టీమ్‌

అద్దంకి మండలం కుంకుపాడు,  కారంచేడు మండలం తిమిడిదపాడు గ్రామాల్లోని పోలే రమ్మ తల్లి దేవాలయాల్లో ఆదివారం రాత్రి చోరీలు జరిగాయి. గుర్తుతెలియని దుండగులు ఆలయాల్లోని హుండీలను పగులగొట్టి అందులోని కానుకలను అపహరించుకుపోయారు.

 కుంకుపాడు పోలేరమ్మ ఆలయంలో..

అద్దంకి, జూన్‌ 21: మండలంలోని కుంకుపాడులో గల పోలే రమ్మ తల్లి దేవాలయంలో చోరీ  జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కుంకుపాడులోని పోలేరమ్మ దేవాలయంకు ప్రతి  ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. సోమవారం ఉదయం పూజారి ఎరగొర్ల అంజయ్య దేవాలయం వద్దకు వెళ్లిచూడగా దేవాలయం గేటు తాళం పగులగొట్టి ఉంది. దేవాలయంలోని ఇత్తడి గ ంటలు, ఇతర వస్తువులు అపహరించుకు పోయారు. వీటి విలువ రూ.4 వేలు ఉంటుందని అంచనా. అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేష్‌ తెలిపారు.

తిమిడితపాడు  ఆలయంలో..

తిమిడితపాడు(పర్చూరు) : కారంచేడు మండల పరిఽధిలోని తిమిడితపాడు గ్రామ పోలేరమ్మ దేవాలయంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోని హుండీని పగులకొట్టి అందులో ఉన్న నగదుతోపాటు పక్కనే ఉన్న స్టోర్‌ రూమ్‌లో సీసీ కెమెరాకు సంబంధించిన హార్డ్‌డిస్క్‌, మానిటర్‌ను ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం దీపారాధన చేయటానికి వచ్చిన పూజారి ఆలయం తలుపు పగులకొట్టి ఉండటం గమనించి కమిటీ ప్రతినిధులకు తెలిపారు. దీనిపై కారంచేడు పోలీసులకు సమాచారం అందించగా చీరాల రూరల్‌ సీఐ రోశయ్య, ఎస్సై అహ్మద్‌ జానీ సంఘటనా స్థలానికి చేరుకొని చోరీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఒంగోలు క్లూస్‌ టీం ఆధ్వర్యంలో వివరాలు సేకరించింది. చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అహ్మద్‌ జానీ తెలిపారు.


Updated Date - 2021-06-22T07:02:24+05:30 IST