పాకల తీరంలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు

ABN , First Publish Date - 2022-05-20T05:14:18+05:30 IST

ఇంటర్‌ పరీక్షలు పూర్తిచేసుకొని సరదాగా సముద్రతీరంలో స్నేహితులతో కలిసి సముద్రస్నానం చేయడానికి వచ్చిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరు మృత్యువాత పడగా మరొకరిని మెరైన్‌ పోలీసులు కాపాడారు. మెరైన్‌ పోలీసుల కథనం ప్రకారం.. కందుకూరులోని ఓ కాలేజీలో ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు పూర్తిచేసుకొన్న విద్యార్థులు పదిమంది గురువారం సాయంత్రం సింగరాయకొండ మండలంలోని పాకల సముద్రస్నానానికి వెళ్లారు.

పాకల తీరంలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
హేమంత్‌రెడ్డికి ప్రథమ చికిత్స చేస్తున్న మెరైన్‌ కానిస్టేబుళ్లు

 ఒకరి మృతి.. మరొకరిని కాపాడిన మెరైన్‌ పోలీసులు

సింగరాయకొండ, మే 19 : ఇంటర్‌ పరీక్షలు పూర్తిచేసుకొని సరదాగా సముద్రతీరంలో స్నేహితులతో కలిసి సముద్రస్నానం చేయడానికి వచ్చిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరు మృత్యువాత పడగా మరొకరిని మెరైన్‌ పోలీసులు కాపాడారు. మెరైన్‌ పోలీసుల కథనం ప్రకారం.. కందుకూరులోని ఓ కాలేజీలో ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు పూర్తిచేసుకొన్న విద్యార్థులు పదిమంది గురువారం సాయంత్రం సింగరాయకొండ మండలంలోని పాకల సముద్రస్నానానికి వెళ్లారు. తీరంలో ఉన్న వంతెన సమీపంలో ఉల్లాసంగా మునుగుతున్న తరుణంలో ఒక్కసారిగా వచ్చిన అల ధాటికి కందుకూరుకి చెందిన పళ్లగళ్ల హేమంత్‌కుమార్‌రెడ్డి, గుడ్లూరుకి చెందిన చరణ్‌సాయి సముద్రంలోకి కొట్టుకుపోయారు. గమనించిన వారి స్నేహితులు పెద్దగా కేకలు పెట్టారు. వెంటనే ఒడ్డున ఉన్న మెరైన్‌ కానిస్టేబుళ్లు అప్రమత్తమై సముద్రంలో కొట్టుకుపోతున్న ఇద్దరిని ఒడ్డుకి చేర్చారు. మెరైన్‌ కానిస్టేబుళ్లు సకాలంలో అందించిన ప్రఽథమ చికిత్సతో చరణ్‌సాయి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. హేమంత్‌కుమార్‌రెడ్డికి ప్రఽథమ చికిత్స చేసినా పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే 108కి సమాచారం ఇచ్చారు. వాహనంలో కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్సై లంకా సంపత్‌కుమార్‌ మృతదేహాన్ని కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Updated Date - 2022-05-20T05:14:18+05:30 IST