షాపింగ్‌కు వెళ్లిన అక్కాచెల్లెళ్లు.. ఇంతలో టీజ్ చేస్తూ వెంటపడ్డ పోకిరి.. దీంతో వాళ్లు అతడికి ఏ రేంజ్‌లో సమాధానం ఇచ్చారంటే..

ABN , First Publish Date - 2022-01-30T22:45:40+05:30 IST

షాపింగ్ చేసేందుకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు సరదాగా బయటికొచ్చారు. తమకు కావాల్సిన వాటి కోసం స్థానికంగా ఉన్న షాపుల్లో వెతకడం ప్రారంభించారు. ఇంతలో ఆ అక్కాచెల్లెళ్లపై ఓ ఆకతాయి కన్నేశాడు. అసభ్య ప

షాపింగ్‌కు వెళ్లిన అక్కాచెల్లెళ్లు.. ఇంతలో టీజ్ చేస్తూ వెంటపడ్డ పోకిరి.. దీంతో వాళ్లు అతడికి ఏ రేంజ్‌లో సమాధానం ఇచ్చారంటే..

ఇంటర్నెట్ డెస్క్: షాపింగ్ చేసేందుకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు సరదాగా బయటికొచ్చారు. తమకు కావాల్సిన వాటి కోసం స్థానికంగా ఉన్న షాపుల్లో వెతకడం ప్రారంభించారు. ఇంతలో ఆ అక్కాచెల్లెళ్లపై ఓ ఆకతాయి కన్నేశాడు. అసభ్య పదాలతో కామెంట్ చేయడం మొదలు పెట్టాడు. తొలుత ఈ విషయాన్ని లైట్ తీసుకున్న వాళ్లు.. ఆ తర్వాత పోకిరీకి దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



మధ్యప్రదేశ్‌లోని దామోహ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. షాపింగ్ కోసమని శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికొచ్చారు. టౌన్‌లోని మాల్‌లో షాపింగ్ చేస్తుండగా.. వాళ్ల దగ్గరకు ఓ ఆకతాయి వచ్చాడు. తర్వాత తన మాటలతో ఆ అక్కాచెల్లెళ్లను టీజ్ చేయడం మొదలు పెట్టాడు. అయితే.. తొలుత ఆ మాటలను వారిద్దరూ లైట్ తీసుకున్నారు. ఈ క్రమంలో ఆ పోకిరీ మాటలు శ్రుతిమించాయి. దీంతో అక్కాచెల్లెళ్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోకిరీని నడీరోడ్డుపై లాక్కొచ్చి.. చెప్పులు విరిగే వరకూ చితకబాదారు. ఈ క్రమంలో దాదాపు 10 నిమిషాల తర్వాత ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే.. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కలిసి ఆకతాయికి బుద్ధి చెబుతున్న సన్నివేశాలను కొందరు స్థానికులు తమ ఫోన్‌లలో బంధించారు. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. 




Updated Date - 2022-01-30T22:45:40+05:30 IST